Breaking News

రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని కాలేజీలపై చూపిస్తారా?: మల్లాది విష్ణు

Published on Sat, 06/07/2025 - 16:59

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బ్రాహ్మణులపై దౌర్జన్యాలు పెరిగిపోయామని.. బ్రాహ్మణులను కూటమి ప్రభుత్వం బలహీనులుగా చూస్తోందంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. అందుకు నిదర్శనమే విజయవాడలో శాతవాహన కాలేజీ కూల్చివేతేనన్నారు. కాలేజీని కూల్చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు?. ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ విష్ణు డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సర్టిఫికెట్లు సైతం శిథిలాల కింద ఉండి పోతే ప్రభుత్వం చోద్యం చూస్తోందని.. ఇదే కేసుకు సంబంధించి టీడీపీ ఎమ్మెల్సీ.. కాలేజీ ప్రతినిధిని కిడ్నాప్ చేశారు.. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘కాలేజీకి చెందిన ఐదు ఎకరాల భూమిని కబ్జా చేయటానికే ఇలా దౌర్జన్యం చేశారు. కోర్టు తీర్పు ఉందని‌ ఎలాంటి దౌర్జన్యమైనా చేస్తారా?. బ్రాహ్మణులు బలహీనంగా ఉన్నారని ఇలాంటి దాడులు చేస్తారా?. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కాలేజీల మీద కూడా చూపిస్తారా?. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ దీనికి సమాధానం చెప్పాలి.

అక్రమంగా భూములు లాక్కుంటే లోకేష్ ఏమీ మాట్లాడరా?. బ్రాహ్మణులను బలహీనులుగానే చూస్తారా?. పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కూడా నమోదు చేయలేదు. దీన్ని వైఎస్సార్‌సీపీ సీరియస్‌గా తీసుకుంటుంది. మా హయాంలో ఎప్పుడూ ఇలాంటి దారుణాలు జరగలేదు. విజయవాడలో దౌర్జన్యం రాజ్యమేలుతోంది. కిడ్నాప్ చేసిన వారి మీద, కాలేజీని ధ్వంసం చేసిన వారిపై న్యాయ పోరాటం చేస్తాం’’ అని మల్లాది విష్ణు హెచ్చరించారు.

విజయవాడలో బలవంతంగా శాతవాహన కాలేజీని కూల్చివేశారు: మల్లాది

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)