Breaking News

2027 చివర్లో జమిలి ఎన్నికలు: వైఎస్‌ జగన్‌

Published on Tue, 12/24/2024 - 16:13

వైఎస్సార్‌ జిల్లా, సాక్షి: ఎన్నికలకు ముందు అలవి గాని హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు.  పులివెందుల పర్యటనలో భాగంగా.. కడప నేతలు, కార్పొరేటర్లతో తాజా పరిణామాలపై ఆయన చర్చించారు.

‘‘కష్టాలు అనేవి శాశ్వతం కావు. కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు.మనమందరం కలిసికట్టుగా పని చేయాలి. దేశ చరితలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు చేశాం. అబద్ధాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నాం. మోసపూరిత హామీలతో చంద్రబాబు(Chandrababu) అధికారంలోకి వచ్చారు.  కానీ, 

 

..మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మనం మార్చాం. కోవిడ్‌ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదు. కార్యకర్తలు కాలర్‌ ఎగరేసుకునేలా పాలన చేశాం. 2027 చివరిలో జమిలి ఎన్నికలు(Jamili Elections) రావొచ్చు. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే. ప్రతికార్యకర్తకు అండగా ఉంటాం’’ అని అన్నారాయన. ఈ కార్యక్రమంలో.. ఆంజాద్‌ బాషా, కడప మేయర్‌ సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. 

పార్టీ కార్యక్రమాలతో పాటు ఇటీవల కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) చేస్తున్న అరాచకాలను కడప నాయకులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేషన్లలో బలం లేకపోయినా టీడీపీ నేతలు పెత్తనం కోసం ఎలా పాకులాడుతున్నారో తమ అధినేతకు వివరించారు.  ‘‘మాట మీద నిలబడితే ప్రజలు వాస్తవాలను తెలుసుకుని ఆదరిస్తారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా నిత్యం మనం ప్రజల కోసమే పోరాడాలి’’ అని నేతలకు వైఎస్‌ జగన్‌(YS Jagan) సూచించారాయన.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)