Breaking News

ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్‌ జగన్‌

Published on Mon, 10/21/2024 - 04:16

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ కడప జిల్లా బద్వేల్‌లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్ర­బాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా జగన్‌ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.

ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలో
రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడలేకపో­తు­న్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేక­పోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్ర­బాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపో­యాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజే­స్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్‌సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.

ఇది అన్యాయం కాదా? వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్‌లో ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్‌ చేస్తారు.

ఫోన్‌ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్‌లోడ్‌  చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసు­లకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 

18 ‘దిశ’ పోలీస్‌స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్‌ మేనేజ్‌మెంట్‌ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటు­న్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవు­తున్న కార్యక్రమాలను, స్కీమ్‌లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్‌ లాంటి స్కామ్‌లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగు­లొ­త్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ?

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)