Breaking News

చంద్రబాబు సర్కార్‌కు వైఎస్‌ జగన్‌ అల్టిమేటం

Published on Thu, 12/18/2025 - 13:57

ప్రైవేటీకరణ అనేదే పెద్ద స్కామ్‌ అని.. అలాంటి స్కామ్‌ల ఎన్నైనా చేయడానికి చంద్రబాబు నాయుడు ఏనాడూ వెనకడుగు వేయబోరని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు.  గురువారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

సాక్షి, తాడేపల్లి: కోటి సంతకాల సేకరణ ఒక చరిత్ర. ఈ సంతకాలను గవర్నర్‌కు సమర్పించి.. చంద్రబాబు నిర్ణయం పట్ల వ్యక్తమైన ప్రజా వ్యతిరేకతను తెలియజేస్తామని వైఎస్‌ జగన్‌ అన్నారు. ‘‘కోటి సంతకాలతో గవర్నర్‌ను కలుస్తాం. అంతకు ముందు అంబేద్కర్‌ విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్తాం. అవసరమైతే ఈ పత్రాలతో కోర్టు తలుపులు తడతాం. ఆ మేరకు కోర్టులో పిటిషన్‌ వేస్తాం. 

న్యాయస్థానం ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్‌.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి.. ప్రైవేటు మెడికల్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలను చంద్రబాబు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్‌ అయితే.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇవ్వడం మరో పెద్ద స్కామ్‌. ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించాక ఇక ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏంటి?. ఒక మెడికల్‌ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది కదా పెద్ద స్కామ్‌ అంటే!.

కోటి సంతకాల మహోద్యమం చూసైనా చంద్రబాబు సర్కార్‌ నిర్ణయం మార్చుకోవాలి. లేకుంటే ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం. రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. చంద్రబాబుకు గట్టి గుణపాఠం చెబుతాం’’ అని జగన్‌ అల్టమేటం జారీ చేశారు.

YS Jagan : ఎన్. జనార్ధన రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేశాడు..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)