Breaking News

కూటమిలో పవన్‌ స్థాయి అది: ఎంపీ విజయసాయి రెడ్డి

Published on Wed, 11/06/2024 - 21:08

విశాఖపట్నం, సాక్షి: వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూటమి ప్రభుత్వం మండిపడ్డారు. రెండు రోజుల్లో కూటమి ప్రభుత్వం  100 మందిని అరెస్టు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. 

‘‘ సీఎం చంద్రబాబు చేసే పాపాలు నాగుపాములై లోకేష్‌ను కాటేస్తాయి. చంద్రబాబు చేసే పాపానికి పదింతలు శిక్ష లోకేష్ అనుభవిస్తారు. అధికారం శాశ్వతం కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంగించి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది. 

పవన్ కళ్యాణ్‌ను కూటమిలో ద్వితీయ శ్రేణి పౌరునిగా చూస్తున్నారు. అధికారంలోకి రాక ముందు పవన్ కళ్యాణ్ కాళ్లు లోకేష్ పట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినోద్దు అంటూ అధికారులకు లోకేష్ చెబుతున్నారు. లోకేష్ కోసం పవన్ కళ్యాణ్‌ను, కాపు జాతిని చంద్రబాబు తొక్కి పెడుతున్నారు. పవన్‌పై మందకృష్ణ మాదిగ విమర్శలు చంద్రబాబు మార్కు రాజకీయానికి నిదర్శనం. లోకేష్ రాజకీయ ఎదుగుదల కోసం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు తొక్కిపెడుతున్నారు. 

లోకేష్‌ను సీఎం చేయడం కోసం 25 శాతం ఉన్న కాపులను పవన్ కళ్యాణ్‌ను ప్రణాళిక బద్ధంగా పక్కకుపెడుతున్నారు. ఋషికొండ అద్భుతమైన కట్టడం.. ఆ భవనం రాష్ట్రానికి తలమానికం. రుషికొండ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలియని మూర్ఖుడు, అసమర్ధుడు చంద్రబాబు. ఋషికొండ భవనాలపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు కచ్చితంగా వస్తాయి. పార్లమెంటు, ఎమ్మెల్యే స్థానాలు కచ్చితంగా పెరుగుతాయి. 2027 తర్వాత మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం’’ అని అన్నారు.

చదవండి: తస్సుమనిపించిన పవన్‌ ఢిల్లీ పర్యటన!
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)