Breaking News

త్వరలో ఢిల్లీకి టీపీసీసీ నేతలు.. రాహుల్‌ అమెరికా నుంచి రాగానే!

Published on Wed, 06/07/2023 - 07:24

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు త్వరలోనే ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలు, కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో నెలకొన్న వాతావరణం, పార్టీలోకి చేరికలు, ఈ నెలలోనే నిర్వహించాల్సిన బహిరంగ సభలు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ముగింపుతో పాటు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు  సన్నద్ధతపై అధిష్టానంతో చర్చించనున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీదీలతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించేందుకు గానూ త్వరలోనే ఏఐసీసీ నుంచి తెలంగాణ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులకు ఆహ్వానం అందనున్నట్టు తెలుస్తోంది.

ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌ సమావేశాల్లో భాగంగా ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్‌గాంధీ ఈనెల 8వ తేదీన ఢిల్లీ వస్తారని, ఆ తర్వాత ఎప్పుడైనా తెలంగాణ నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు రావచ్చని సమాచారం. 9 లేదా 10 తేదీల్లో ఈ సమావేశం ఉండే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నా, గత నెల 26నే జరగాల్సిన సమావేశం వాయిదా పడిన నేపథ్యంలో తేదీల ఖరారుపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.    
చదవండి: ధరణి మూలంగానే రైతుబంధు, ఎక్స్‌గ్రేషియా, పంటలకు డబ్బులు: కేసీఆర్‌

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)