Breaking News

వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!

Published on Tue, 12/30/2025 - 15:56

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అటు ప్రభుత్వ, ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్‌ వెళ్లినట్లు సమాచారం. అయితే.. న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసమే ఆయన వెళ్లి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపు.  

ఉండవల్లి నుంచి హైదరాబాద్‌కు.. అక్కడి నుంచి అటే లండన్‌కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. అయితే.. పదేపదే విదేశీ పర్యటల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి.. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. అయితే.. 

సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం.. కనీస సమాచారం లేకపోవడం తెలుగు దేశం పార్టీలోనూ తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం లోకేష్‌ విదేశీ పర్యటనలోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్‌ భేటీకి కూడా హాజరు కాలేదు. 

రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి నేతలు చంద్రబాబు, పవన్‌, నారా లోకేష్‌లు మాత్రం విలాసాల విషయంలో ‘తగ్గేదే లే’ అంటున్నారు.  ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖాజనాకు చిల్లు పెడుతుండడం సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)