Breaking News

ఎవరు నిజమైన రాహుల్‌ గాంధీ?: స్మృతి ఇరానీ

Published on Sat, 03/23/2024 - 16:38

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీపై  కేంద్రమంత్రి స్మృతి ఇరానీ  విమర్శలు గుప్పించారు. రాహుల్‌ గాంధీ ద్వంద వైఖరిపై మండిపడ్డారు. రాహుల్‌ గాంధీ ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై  సంఘీభావం తెలుపుతారు. అదేవిధంగా తెలంగాణలో మాట్లాడినప్పుడు మాత్రం కేజ్రీవాల్‌ అవినితీ పరుడని అంటారని స్మృతి ఇరానీ ఎద్దేవా చేశారు.

‘రాహుల్‌ గాంధీ  ద్వంద  వైఖరిలో మాట్లాడానికి సంబంధించి నేను ఆధారాలు ఇవ్వగలను. కేజ్రీవాల్‌తో పాటు బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అవినీతిపరుడని 2, జూలై,  2023లో తెలంగాణ రాహుల్‌ మాట్లాడుతూ అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ గురించి అన్ని విషయాలు దర్యాప్తు సంస్థలకు తెలుసన్నారు. అవినీతి సొమ్మును ఆప్‌ గోవా ఎన్నికలకు వినియోగించిందని  కాంగ్రెస్‌ నేత అజయ్‌ మాకెన్‌ అన్నారు. వీరిలో ఎవరు నిజం చెబుతున్నారు?’ అని స్మృతి ఇరానీ  నిలదీశారు.

ఎవరు నిజమైన రాహుల్‌ గాంధీ?  తెలంగాణలో మాట్లాడే రాహుల్‌ గాంధీ? లేదా ఢిల్లీలో మాట్లాడే రాహుల్‌ గాంధీ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉండి, అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎంతటి అవినీతికి పాల్పడతారో అరవింద్‌ కేజ్రీవాల్‌ను చూస్తే తెలుస్తోందని స్మృతి ఇరానీ మండిపడ్డారు.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్‌ కావటంతో రాహుల్‌ శుక్రవారం కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్‌ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే  ఆయన్ను అరెస్ట్‌ చేశారని అన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈడీ రిమాండ్‌లో ఉన్నారు. అదేవిధంగా ఇదే కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఏడురోజుల రిమాండ్ పూర్తి చేసుకోగా... తాజాగా (శనివారం) రౌస్‌ అవెన్యూ కోర్టు మరో మూడురోజులు ఈడీ కస్టడీకి అప్పగించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)