ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
బిగ్ న్యూస్: అనితా మేడమ్.. ఈ ప్రశ్నలకు జవాబుందా?
Published on Mon, 06/02/2025 - 12:49
సాక్షి, విజయవాడ: కూటమి పాలనలో శాంతి భద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. తాజాగా.. తెనాలిలో పోలీసులు నడిరోడ్డు మీదే యువకులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఘటనపై(Tenali Police Torture) సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ స్థాయిలోనూ ఈ ఘటనపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. దళితులపై పోలీస్ టార్చర్ను హోం మంత్రి వంగలపూడి అనిత(Vangalapudi Anitha) సమర్థించడంతో.. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు.
చిన్న పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వాళ్ళని ఎందుకు ఇలా కొట్టలేదు మేడమ్?
ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడ్డ టీడీపీ ఎమ్మెల్యే, కూటమి పార్టీల నేతలను ఎందుకు ఇలా శిక్షించలేదు మేడమ్?
దళిత ప్రొఫెసర్ని కొట్టిన జనసేన ఎమ్మెల్యేపై ఇలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేదు మేడమ్?
అసలు పోలీసుల దాష్టికాన్ని మీరు ఇలా ఎలా సమర్థిస్తారు మేడమ్?.. అంటూ హోం మంత్రికి పలువురు నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు.
వీటితో పాటు కూటమి ప్రభుత్వం(AP Kutami Prabhutvam) అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నడుస్తున్న ప్రతీకార రాజకీయంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ.. పలు ఉదంతాలను ప్రస్తావిస్తూ హోం మంత్రి అనితను సూటిగా ప్రశ్నిస్తున్నారు. చట్టాలు, కోర్టులు వేయాల్సిన శిక్షలు పోలీసులే వేస్తారన్న ధోరణిలో మాట్లాడిన హోం మంత్రి.. పై ఘటనలను తన వ్యాఖ్యలతో ఎలా సమర్థించుకుంటారు అంటూ నిలదీస్తున్నారు.

‘‘పోలీసులు యాక్షన్ తీసుకోలేదంటారు. ఒక స్టెప్ ఫార్వార్డ్ వేస్తే ఈ రకంగా విమర్శిస్తున్నారు. పోలీసులు ని కొంత పని చేసుకొనివ్వాలి. తెనాలిలో రౌడీ షీటర్స్ పోలీసులు పై దాడికి ప్రయత్నించారు. పోలీసులు ని కొట్టినందుకే అలా చేశారు. వాళ్ళందరూ రౌడీ షీటర్లు, గంజా బ్యాచ్’’.. ఇదీ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ను పర్యవేక్షించే మంత్రి అనిత నోటి నుంచి వచ్చిన తప్పుడు ప్రకటనలు.
ఇదీ చదవండి: జగన్ అడిగిందేంటి.. చంద్రబాబు చెబుతోందేంటి?
Tags : 1