Breaking News

చాన్స్‌ ఇచ్చినా మోదీ కాదన్నారు: రాహుల్‌ గాంధీ

Published on Tue, 06/25/2024 - 12:35

ఢిల్లీ: లోక్‌సభ స్పీకర్‌ ఎన్నికపై అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా కూటమి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక అనివార్యం అయింది. అధికార ఎన్డీయే కూటమి నుంచి  బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ఇండియా కూటమి కేరళ కాంగ్రెస్‌ ఎంపీ కే సురేష​ నామినేన్లు దాఖలు చేశారు. దీంతో దేశ చరిత్రలోనే.. రేపు(జూన్‌ 26,2024) తొలిసారి లోక్‌సభ స్పీకర్‌ పదవికి ఎన్నిక జరగబోతోంది.
 

అయితే ఇవాళ ఉదయం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. డిప్యూటీ స్పీకర్‌ వ్యవహారంపై బీజేపీ వ్యవరించిన తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. 

‘‘ స్పీకర్‌  పదవికి  ఎన్నికకు ఇండియా కూటమి విపక్షాలు సహరిస్తాయని చెప్పాం. డిప్యూటీ స్పీకర్‌ విషయంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాకు ఫోన్‌ చే​స్తాని చెప్పి ఇప్పటికీ చేయలేదు. మా అధ్యక్షుడు ఖర్గేను రాజ్‌నాథ్‌సింగ్‌ అవమానించారు. మోదీ తాను వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలి. ఖర్గేతో జరిగిన చర్చలో రాజ్‌నాథ్‌ సింగ్‌ డిప్యూటీ స్పీకర్‌పై  ఎటుంటి హామీ ఇవ్వలేదు.

ప్రధాని మోదీ చెప్పెది ఒకటి.. చేసేది ఒకటి. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్‌ పదవి ప్రతిపక్షాలకు కావాలన్నాం. డిప్యూటీ స్పీకర్‌పై స్పష్టమైన హామీ ఇస్తేనే స్పీకర్‌ ఏకగ్రీవ  ఎన్నికకు సహకరిస్తామని చెప్పాం. యూపీఏ హయాంలో మేము డిప్యూటీ స్పీకర్‌ పదవిని   అప్పటి  విపక్షాలకు ఇచ్చాం’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

రాజకీయం చేయటం  సరికాదు: కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌
కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పందించారు. ‘స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే బాగుంటుంది. ఇలా రాజకీయం చేయటం సరికాదు. విపక్షాలకు డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇవ్వాలాని ఎలాంటి నిబంధనల లేవు. ముందు డిప్యూటీ స్పీకర్‌ ఎవరో? తేల్చాలని కాంగ్రెస్‌ పట్టుబట్టింది’అని అన్నారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)