Breaking News

వంశీని జైల్లో ఉంచి టీడీపీ గొయ్యి తవ్వుకుంది: పేర్ని నాని

Published on Wed, 07/02/2025 - 16:23

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విడుదలపై వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. వంశీని జైల్లో ఉంచి కొందరు శునకానందం పొందారని, ఇందుకు రేపో.. మాపో.. మరో నాలుగేళ్లకో వాళ్లే అందుకు పశ్చాత్తాపం చెందుతారని అన్నారాయన. 

సాక్షి, ఎన్టీఆర్‌: విజయవాడ జైలు నుంచి వల్లభనేని వంశీ మోహన్‌ ఇవాళ(జులై 2, బుధవారం) విడుదలయ్యారు. ఈ సందర్భంగా పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘వల్లభనేని వంశీపై పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని ఇబ్బంది పెట్టారు. 140 రోజుల తర్వాత వంశీ జైలు నుంచి బయటకు వచ్చారు. ఒకే కేసులో బెయిల్‌ వస్తే.. మరో కేసు పెడుతూ కుట్రలు చేశారు. ఐదేళ్లు, పదేళ్లు కింద జరిగినవాటికి కూడా కేసు పెట్టారు. లొసుగులు వాడుకుంటూ వాయిదాల మీద వాయిదాలు అడుగుతూ ఎత్తుగడలు వేశారు. 

అడ్డగోలు జీతాలు తీసుకుని వాదించేవాళ్లు  ఉన్నా కూడా.. వాదించడానికి ఢిల్లీ బాబాయి రావాలి అంటూ వాయిదాలు వేయించుకున్నారు. చివరకు ఇవాళ కూడా సుప్రీం కోర్టులో వంశీ బెయిల్‌ను రద్దు చేయించే ప్రయత్నం చేశారు. ఇంత చేసి సాధించింది ఏంటి?.. అక్రమ కేసులు, వేధింపులతో ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేయడమా? పోనీ..

వంశీని రాజకీయాల నుంచి పారిపోయేలా చేశారా?.. గన్నవరం ప్రజల నుంచి దూరం చేయగలిగారా?. పైగా ఎన్నికలు జరిగి ఏడాది పూర్తి కాకుండానే ప్రజల్లో సానుభూతిని మూటగట్టి పెట్టారు. వంశీని జైల్లో ఉంచి మీ పార్టీకి(టీడీపీని ఉద్దేశించి..) మీరే గొయ్యి తవ్వుకున్నారు. కక్ష సాధింపు తప్ప కూటమి సాధించింది ఏమీ లేదు. కేవలం శునకానందం పొందారు. రేపో,, మాపో, మరో నాలుగేళ్లకైనా దీని వెనుక ఉన్నవాళ్లు ఈ విషయం తెలుసుకుంటారు అని పేర్ని నాని అన్నారు.

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)