Breaking News

అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం: పెద్దిరెడ్డి

Published on Wed, 02/11/2026 - 20:12

సాక్షి, గుంటూరు: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో అరాచకం పతాక స్థాయికి చేరిందని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంటూరులో  మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం  మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలే లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు.

సౌమ్యుడైన అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేయడంతో పాటు బీసీ నేత మరో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఈ తరహా దాడులు మునుపెన్నడూ చూడలేదని.. ఈ అరాచకాలకు మంత్రి లోకేషే మూల కారణమని తేల్చి చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం అయితే ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఇంకా ఏమన్నారంటే..

సౌమ్యుడైన అంబటి రాంబాబు మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇంటిపై అత్యంత దారుణంగా దాడి చేశారు. ఆ తర్వాత బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటిపై ఏకంగా పెట్రోలు బాంబులతో దాడి చేశారు. ఇలాంటి దాడులతో కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అర్ధం కావడం లేదు? ఇలాంటి దాడులతో మళ్లీ రాజకీయాలలో మనుగడ సాగించాలన్న ఆలోచన చేస్తుందా? లేదా అన్నది కూడా అర్ధం కావడం లేదు. వీరి తీరును రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనైనా, విడిపోయిన తర్వాత అయినా మాజీ మంత్రులు, శాసనసభ్యుల ఇళ్లపై దాడి చేసే సంస్కృతి ఎప్పుడూ చూడలేదు.

1978 నుంచి రాజకీయాల్లో నేను కూడా ఏ పార్టీ ఇలాంటి దాడులకు పాల్పడ్డాన్ని చూడలేదు. కాపులకు అండగా ఉంటానన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమయ్యాడు? ఆ రోజు అధికారం కోసం అడ్డగోలుగా  అబద్దాలు చెప్పిన పవన్ కళ్యాణ్.. 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పాడు. ఇవాళ ఒక్క మహిళనైనా మరి వెనక్కి తిరిగి తీసుకొచ్చాడా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్నే మర్చిపోయాడు. చంద్రబాబు, లోకేష్‌లు రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప.. పవన్ కళ్యాణ్ కాపులకు చేసిందేమీ లేదు.

మరో వైపు, రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నింటికీ మూల కారణం లోకేష్. చంద్రబాబు పవన్ కళ్యాణ్, లోకేష్‌లు చేస్తున్న తప్పులకు వత్తాసు పలకడం తప్ప.. తన వయస్సుకు తగినట్లు ప్రవర్తించడం లేదు. ఆలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ , లోకేష్‌లకు ఒక్కటే చెబుతున్నాం. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం అయితే మీకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు, మీ డిపాజిట్లు గల్లంతవడం ఖాయం. ఇవాళ శాసనసభలో అధికార పార్టీ నేతల మొహాలు చూస్తుంటేనే వారి పరిస్థితి అర్ధం అవుతుంది. వారి మొహాల్లో భయం కనిపిస్తోంది.

అంబటి రాంబాబు కుటుంబానికి వైఎస్‌ జగన్‌తో పాటు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. రాంబాబు మీద దాడి చేసిన వారు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని, అధికార పార్టీ నేతలు చేసిన దుశ్చర్యను ప్రజలందరూ గమనిస్తున్నారని, తగిన టైంలో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. అంబటి రాంబాబుకి బెయిల్ రావడంపై హర్షం వ్యక్తం చేశారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)