Breaking News

కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే

Published on Tue, 05/27/2025 - 19:17

సాక్షి,హైదరాబాద్‌:  ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్‌ పుట్టించింది. 

అయితే, ఆ లేఖ బీఆర్‌ఎస్‌తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్‌ఎస్‌ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూన్‌ 2న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్‌ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్‌ రావు.  

కేసీఆర్‌కు కవిత లేఖ
ఇటీవల కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్‌ రావు కవిత, బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు.  

అప్పుడు కాంగ్రెస్‌.. ఇప్పుడు కొత్త పార్టీ ​ 
కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్‌ఎస్‌  సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్‌తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్‌ రావు వ్యాఖ్యానించడం గమనార్హం.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)