Breaking News

‘రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో’?

Published on Wed, 06/18/2025 - 15:09

సాక్షి,తెలంగాణ: రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటో? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్ అని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. బుధవారం (జూన్‌18) ఎమ్మెల్సీ కవిత ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు.

‘కేంద్ర బీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని కోరుతూ తెలంగాణ జాగృతి తరుఫున జులై 16,17,18న రైల్వే రోకోలు నిర్వహిస్తాం. రైల్వే వ్యవస్థను స్తంబింపజేస్తాం. బనక చర్ల ప్రాజెక్ట్ అపాలంటే  ఢిల్లోలో ఉద్యమాలు చేయాలి. ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో ఒరిగేదేమీ లేదు.  డిల్లీకి వెళ్ళే సీఎంలలో రేవంత్ గిన్నిస్ బుక్ రికార్డు. కేటీఆర్‌ ఏసీబీ విచారణ అంతా టైంపాస్‌

నిరుపయోగంగా సముద్రంలోకి వెళుతున్న నీటిని రెండు రాష్ట్రాలు వాడుకోవాలి అని కేసీఆర్ చెప్పారు. లీకేజీ పాయింట్ తుపాకుల గూడెం బ్యారేజి వద్ద ఉండాలని కేసీఆర్‌ తెలిపారు. పోలవరం వద్ద లీకేజీ పాయింట్ పెడితే తెలంగాణకు అన్యాయం జరుగుతుంది.

సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంతో తుపాకుల గూడెం వద్ద లీకేజీ పాయింట్‌ను చేపట్టాలని ఎందుకు చెప్పడం లేదు? రేవంత్‌కు చంద్రబాబుకు ఉన్న లాలూచీ ఏంటి? రేవంత్ నల్లమల టైగర్ కాదు..పేపర్ టైగర్ రేవంత్. చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణపై అక్రమంగా నిర్మిస్తున్న నీటి ప్రాజెక్ట్‌లపై కోర్టుకు వెళ్తాం. బనక చర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం.

కేటీఆర్‌పై ఏసీబీది టైం పాస్ విచారణ.ఇలాంటి విచారణలు చాలా చూశాం. హరీష్ రావుకు అస్వస్థత విషయం నాకు తెలియదు. నేను ఏ కార్యక్రమం చేసినా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వస్తున్నారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ’ అని కవిత స్పష్టం చేశారు.   

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)