Breaking News

‘చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ కలిసినా కాపులు కలవరు’

Published on Tue, 05/02/2023 - 16:37

సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారని.. కేసు కొట్టివేయడం చంద్రబాబు, రామోజీ భరించలేకపోతున్నారని ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,టీడీపీ హయాంలో కాపులను హింసించారని.. కాపు ఉద్యమంలో కాపు నేతలందరిపై 69 కేసులు చంద్రబాబు పెట్టించారని మండిపడ్డారు.

‘‘ముద్రగడ, దాడిశెట్టి రాజా సహా అనేక మందిపై అక్రమ కేసులు పెట్టారు. కాపులపై అన్యాయంగా పెట్టిన కేసులను కోర్టు కొట్టివేసింది. రాజకీయ కక్షతోనే చంద్రబాబు కేసులు పెట్టించారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. చంద్రబాబు హయాంలో కాపులపై పెట్టిన అన్ని కేసులను కేవలం ఒకే ఒక్క జీవోతో సీఎం జగన్‌ ఎత్తివేశారు. కాపులను హింసంచడమే టీడీపీ పని.. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ. కాపుల విషయంలో చంద్రబాబు సైకోలా వ్యవహరించారు’’ అని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
చదవండి: తుని రైలు దగ్ధం కేసు కొట్టివేయడం హర్షణీయం: కన్నబాబు

‘‘పవన్‌  కల్యాణ్‌ ఒక అజ్ఞాని.. ఆయన చంద్రబాబుతో కలిసినా కాపులు కలవరు. కాపులను సర్వనాశనం చేయడమే టీడీపీ లక్ష్యం. పవన్‌ కల్యాణ్‌కు అసలు చరిత్రే తెలియదు కాపులతో చంద్రబాబు పల్లకీ మోయించాలని పవన్‌ చూస్తున్నాడు. ప్యాకేజీ తీసుకుని కాపులను బాబుకు తాకట్టు పెట్టాలని పవన్‌ యత్నం. పవన్‌ కల్యాణ్‌  వైఖరి పట్ల కాపులంతా అప్రమత్తంగా ఉండాలి. ఒక పార్టీలో ఉండి వేరే పార్టీవారితో కలవడం పవన్‌కు అలవాటే. కాపులను అణచివేసిన పార్టీ టీడీపీ’’ అని మంత్రి అన్నారు.
చదవండి: ఏపీ వాసులకు అలర్ట్‌.. మూడురోజుల పాటు భారీ వర్షాలు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)