Breaking News

మాక్‌ పార్లమెంట్‌.. ఎస్ఐఆర్‌ను తక్షణమే నిలిపివేయాలన్న మల్లికార్జున ఖర్గే

Published on Sat, 10/31/2026 - 17:44

సాక్షి,ఢిల్లీ: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై ఇండియా కూటమి పీపుల్స్ ఇంపీచ్‌మెంట్ నిర్వహించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే  నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. మాజీ లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన  మాక్ పార్లమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు‌ రాహుల్ గాంధీ,  సోనియా గాంధీ, సీఎం రేవంత్ సహా పలువురు ఎంపీలు, విపక్ష నేతలు పాల్గొన్నారు.

ఇందులో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ఓటు హక్కుకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కును కాపాడేందుకు ప్రతిపక్షాలన్నీ పోరాటం కొనసాగిస్తాయని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 కల్పించిన ఓటు హక్కును పరిరక్షించాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకే ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ పనిచేస్తున్నారని ఖర్గే తీవ్రంగా ఆరోపించారు. ఆయనను సీఈసీ పదవి నుంచి తొలగించాలని ఏడు నెలల క్రితమే ఉభయ సభల్లో 193 మంది ప్రతిపక్ష ఎంపీలు నోటీసులు ఇచ్చినట్లు ఆయన గుర్తుచేశారు.

ప్రతిపక్ష పార్టీల ఓటర్ల పేర్లను తొలగించి అధికారాన్ని మళ్లీ వాళ్లే కొనసాగించేందుకు కుట్ర జరుగుతోందని ఆయన విమర్శించారు. అంతేకాదు 145 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాతే సీఈసీకి సంబంధించిన చట్టాన్ని ఆమోదించారని ఖర్గే ఆరోపించారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు 40 లక్షల మంది కొత్త ఓటర్లను చేర్చారని, ఎస్ఐఆర్ ప్రక్రియలో అంతకంటే ఐదు రెట్లు ఎక్కువ మంది ఓటర్ల పేర్లను తొలగించారని ఖర్గే పేర్కొన్నారు. ఓటర్లను చేర్చడం కంటే తొలగించడమే ఎస్ఐఆర్ లక్ష్యంగా మారిందని విమర్శిస్తూ, ఈ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.

ఓట్ల చోరీకి వ్యతిరేకంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష ఎంపీలను నిర్బంధించడం, జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు అనుమతి నిరాకరించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. తమ నిరసనలను రామ్‌లీలా మైదాన్‌లో కొనసాగిస్తామని ప్రకటించారు.

దళితులు, మహిళలు, పేదలు, అణగారిన వర్గాల ఓటు హక్కులను కాపాడటమే తమ పోరాట లక్ష్యమని ఖర్గే స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: ట్రంప్‌కు ఏమైంది? ర్యాలీలో కంటి సమస్య.. ఆరోగ్యంపై కలకలం

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)