Breaking News

పవన్‌ ప్రకటన.. బలమా? లేక భయమా?

Published on Mon, 05/26/2025 - 11:30

‘‘ఒక్కసారి మంత్రి పదవి ఇచ్చి చూడు గణనాథ’’ అని ఓ పాట ఉంది. ఇప్పుడు ఈ పాటను ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు అతికినట్టు సరిపోతుంది. ఎందుకంటారా?.  ఆయన ఇప్పుడు తన పదవిని ప్రజాసేవకంటే తన అహంకార ప్రదర్శనకు, వ్యక్తులు, సినీ పరిశ్రమను బెదిరించేందుకే ఎక్కువగా వాడుతున్నట్లు స్పష్టమవుతోంది. కానీ ఆయన గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి ఆయన స్వయానా ముఖ్యమంత్రి కాదు. ఉప ముఖ్యమంత్రి మాత్రమే. రెండోది.. సినిమాటోగ్రఫీ ఆయన పరిధిలోకి రాదు. కాకపోతే ఆ శాఖ జనసేనకే చెందిన కందుల దుర్గేశ్‌ది. అంటే.. 

పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తనకు లేని అధికారాన్ని చేతిలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాల సినీ ప్రముఖులను హెచ్చరించారన్నమాట. ఈ అభ్యంతరకరమైన పని చేస్తున్నప్పుడు కూడా గత ప్రభుత్వం ఏదో సినీ పరిశ్రమను వేధించిందన్న అబద్ధాలను ప్రకటనలో జొప్పించారు. సినీ పరిశ్రమ వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవలేదన్నది ఆయన అభ్యంతరాల్లో ఒకటి. నిజానికి.. 

పరిశ్రమలో పలువురు ప్రముఖులతో (Cine Industry Biggies) చంద్రబాబుకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. వారి సేవలను టీడీపీ బాగానే వాడుకుంటోంది. కానీ కొందరు కీలకమైన వ్యక్తులు పవన్‌ను మాత్రమే కలసివెళ్లారు. అయినా ఆయనలో ఏదో అసంతృప్తి! కృతజ్ఞత చూపడం లేదని ఇంకో మాట అన్నారు పవన్‌. ఇది అడిగి సన్మానం చేయించుకున్నట్లుగా ఉంది! తనకు తెలియకుండా ఎవరూ  సినిమాలు తీయరాదన్నది పవన్‌ ఉద్దేశమా? లేక సినిమా థియేటర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు అంతా తన చెప్పు చేతలలో ఉండాలని కోరుకుంటున్నారా? ఏది ఏమైనా... సినీ పరిశ్రమ మొత్తాన్ని బెదిరిస్తూ పవన్‌ బహిరంగ ప్రకటన జారీ చేయడం వారిని అవమానించడమే!. 

👉వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా సినీ పరిశ్రమ తన వద్దకు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సహా అందరినీ సాదరంగా ఆహ్వానించి, చర్చలు జరిపి, వారి కోర్కెలు తీర్చడానికి ప్రయత్నించారు. ఇప్పుడు పవన్‌ మాత్రం థియేటర్లలో సదుపాయాలు తనిఖీ చేస్తాం.. టిక్కెట్‌ రేట్ల పెంపుదల గురించి ఎవరూ తమ వద్దకు వ్యక్తులుగా  రావద్దు.. ధరలు  పెంచాక దానికి తగ్టట్లే  ఆదాయం ప్రభుత్వానికి వస్తోందా? లేదా? అన్నది చూస్తాం.. అంటూ బెదిరిస్తున్నారు. ఏది కరెక్ట్‌? పైగా.. 

పవన్‌ ఏ అధికారంతో ఇలాంటి ప్రకటనలు చేశారు? ప్రభుత్వ విధానాన్ని ఆయన చెప్పి ఉంటే.. వచ్చే నెలలో విడుదల కానున్న ఆయన సినిమా హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu)కు సంబంధించి రేట్ల పెంపుదల వ్యక్తిగతంగా కోరకుండా ఉంటారా?. ఇకపై ఆయా సినిమా విభాగాలతోనే మాట్లాడతామని పవన్ చెప్పిన మాట తనకు, తన సినిమాలకు కూడా వర్తిస్తుందా? లేదా?. తన సినిమా ప్రమోషన్ కోసం ఏమైనా చేస్తున్నారా?. థియేటర్ల వారు, డిస్ట్రిబ్యూటర్లు  పర్సెంటేజ్ పద్దతి పెట్టాలని, అద్దె ప్రాతిపదికన అయితే తమకు నష్టం వస్తోందని అంటున్నారు. అందులో హేతుబద్దత ఎంత? సమస్యలుంటే పరిష్కరించాలి కాని ఎవరినో దృష్టిలో ఉంచుకుని పవన్ కల్యాణ్‌ ఎందుకు ఈ రకంగా ప్రకటనలు చేస్తున్నారు? సినిమా జయాపజయాలపై ఆందోళనతోనా?. 

👉వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్నినాని ఇప్పటికే పవన్ కల్యాణ్‌ సినిమా ఫ్లాఫ్ అన్నారు. రాజకీయం, సినిమా కలిసినప్పుడు సహజంగానే ఇలాంటి సమస్యలు వస్తాయి. ప్రత్యర్థి  రాజకీయ పార్టీని నోటికి వచ్చినట్లు దూషించి, పలు ఆరోపణలు గుప్పించినప్పుడు వారు చూస్తూ ఉండలేరు కదా!. ఇక్కడ ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పుకోవాలి. మంత్రిగా ఉంటూ పూర్తిస్థాయిలో సినిమాల్లో నటిస్తున్న వ్యక్తి ఒక్క పవన్ కల్యాణే!. కొన్నేళ్ల క్రితమే భారీ అడ్వాన్స్ లు తీసుకుని కొన్ని సినిమాలు  చేయడానికి ఆయన ఒప్పుకున్నారట. కానీ పవన్ ధోరణితో ఆ నిర్మాతలు నిస్సహాయంగా మిగిలిపోయారని అంటారు. కోట్ల రూపాయలు పెట్టుబడులుగా పెట్టిన నిర్మాతలు.. పవన్‌ రాజకీయాల కోసం ఏళ్ల తరబడి షూటింగ్‌లు చేయకుండా ఉండిపోవాల్సి రావడంతో వారు గగ్గోలు పెడుతూ ఉండొచ్చు. తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతం అవుతుండొచ్చు. వీటికి తోడు.. 

ఇటీవల సినిమా ఫంక్షన్లలో రాజకీయ ఉపన్యాసాలు జరుగుతుండడం.. దానిపై విమర్శలు, బాయ్‌కాట్‌ పిలుపులు వస్తుండడంతో నిర్మాతలూ నష్టపోయారు. ఆ మధ్య నటుడు పృథ్వీ వ్యాఖ్యలతో మరో నటుడి సినిమా ఆర్థికంగా నష్టపోయింది. తాజాగా భైరవం సినిమా డైరెక్టర్  వైఎస్సార్‌సీపీని పరోక్షంగా విమర్శిస్తూ.. పవన్‌ను పొగుడుతూ చేసిన వ్యాఖ్య కూడా ఆ సినిమాపై వ్యతిరేక ప్రభావం చూపించేలా ఉంది. 

నిజానికి పార్టీలకు, కులాలకు అతీతంగా ఉండవలసిన సినిమా రంగం వివాదాస్పద వ్యాఖ్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్నారనిపిస్తోంది. ఎన్టీఆర్‌ తెలుగుదేశం స్థాపనతో.. సినిమాలు, రాజకీయం కలసిపోవడం ప్రారంభమైంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత పతాక స్థాయికి చేరిందనే చెప్పాలి. పవన్ కల్యాణ్‌ రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత, తెలుగుదేశంతో కలిసిన తర్వాత అది మరింత చికాకుగా మారింది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’, శ్రీనాథ కవి సార్వభౌముడు చిత్రాల్లో నటించారు. అవి అంతగా సక్సెస్ కాలేదు. కానీ ప్రతిపక్షంలో ఉండగా నటించిన మేజర్ చంద్రకాంత్ సూపర్ హిట్! అధికారాన్ని అనుభవిస్తున్న పవన్‌కూ ఈ భయం (Pawan Cinema Fear) కూడా పట్టుకుని ఉండాలి!!.

ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్‌ పనితీరు అంత సంతృప్తికరంగా లేదని చంద్రబాబు  ప్రభుత్వం ఇచ్చిన రేటింగ్ చెబుతోంది. ఇప్పుడు సినిమాలు బాగా నడిస్తే ఫర్వాలేదు. లేదంటే తన విలువ బాగా తగ్గే అవకాశం ఉంది.  పవన్ ఎంత విధేయుడిగా ఉన్నా.. టీడీపీ వారు ఎక్కువమంది ఈయన వైఫల్యాన్నే కోరుకుంటూ ఉంటారు. అలాగైతేనే పవన్‌ తమకు అణగిమణగి ఉంటారన్నది వారి ఆలోచన. పవన్‌ దూషణల కారణంగా వైఎస్సార్‌సీపీ వాళ్లు ఆయన సినిమాను ఆదరించడం కష్టమే. బహుశా పవన్‌ను ఈ భయాలన్నీ వెంటాడుతున్నాయేమో!. 

ఈ దశలో సినిమా థియేటర్ల బంద్ చేస్తామని హెచ్చరించడం వెనుక ఏదో ఉందని భావించినట్లు ఉన్నారు. వెంటనే తన పార్టీకి చెందిన మంత్రి దుర్గేశ్‌తో ఒక ఆదేశం ఇప్పించారు. ఈ బంద్ పిలుపు వెనుక ఎవరు ఉన్నారో? కనిపెట్టాలని ఆయన హోంశాఖను కోరారట. బహుశా ఇలా బెదిరింపు ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నాం. అక్కడితో ఆగకుండా పవన్ కల్యాణ్‌ తొందరపడి ఒక భారీ ప్రకటన జారీ చేశారు. ఎవరిమీద కోపం ఉందో నేరుగా చెప్పలేదు కానీ... పరోక్షంగా కొన్ని సంకేతాలు అయితే  కనిపిస్తున్నాయి. 

👉ప్రముఖ నిర్మాత ఆయన బంధువైన అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, దిల్ రాజు వంటి కొద్ది మంది చేతిలోనే అత్యధిక థియేటర్లు ఉన్నాయని చెబుతారు. అల్లు అరవింద్, ఆయన కుమారుడు అల్లు అర్జున్‌లతో పవన్‌కు అంత మంచి సంబంధాలు లేవన్న చర్చ కూడా ఉంది. అందువల్లే భయపడో? మరే కారణమో తెలియదు కాని అరవింద్ ఒక్కరే పవన్ కల్యాణ్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. తనకు ఇప్పుడు థియేటర్లు లేవని చెప్పు కోవచ్చు కాని, పవన్ సినిమా విడుదలకు ముందు బంద్ అంటూ దుస్సాహసం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇది మరో నటనగా కనిపిస్తుంది. 

సినీ రంగంపై ఆధిపత్యం కలిగిన ఈ ముగ్గురు, నలుగురు థియేటర్లను  లీజ్ కు తీసుకుంటారు. అందుకే పవన్ కళ్యాణ్ ఈ లీజు అంశాలను కూడా ప్రస్తావించి వారు పన్నులు  కడుతున్నారా? లేదా? థియేటర్లలో సదుపాయాలు ఉన్నాయా? లేదా? తదితర అంశాలను తనిఖీ చేయాలని ఆదేశించారట. ఇంత బహిరంగంగా సినిమా వారిని అదే రంగానికి చెందిన మంత్రి బెదిరించడం ఇప్పుడే చూస్తున్నాం. అంటే  పవన్ తన సినిమా విడుదల టైమ్‌లో ఈ వివాదం రాకపోతే.. థియేటర్లు పన్ను  కట్టకపోయినా, సదుపాయాలు కల్పించకపోయినా, తినుబండారాలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్మినా ఫర్వాలేదన్న మాట!. 

👉వైఎస్‌ జగన్(YS Jagan) ముఖ్యమంత్రిగా ఉన్న  టైమ్‌లో ‘‘సినిమా వాళ్ల గురించి మాట్లాడడానికి, రేట్లు నిర్ణయించడానికి, మా ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకోవడానికి అనుతించకపోవడానికి నువ్వు ఎవరికి?’’ అని ప్రశ్నించిన పవన్‌ కల్యాణ్‌... ఇప్పుడు వాటన్నిటినపై తనకే అధికారం ఉన్నట్లు ఎందుకు మాట్లాడుతున్నారు?. గతంలో బ్లాక్ టిక్కెట్ల విక్రయం లేకుండా చూడడాన్ని కూడా ఆక్షేపించించడం విడ్డూరమే అనిపిస్తోంది. ప్రస్తుతం కౌంటర్లలో టిక్కెట్లు ఎంతకు అమ్ముతున్నారో కూడా చూడాలని అధికారులకు ఈయన  చెప్పారట. పవన్ మరో విచిత్రమైన వాదన చేస్తున్నారు. సినిమా రంగానికి పరిశ్రమ హోదా కోసం ఆయన ఆలోచన చేస్తున్నారట. దాన్ని కూడా పట్టించుకోకుండా సినిమా వారు తనకు బంద్ అంటూ రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారట. 

నిజానికి సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం అంత తేలిక కాకపోవచ్చు. ఎందుకంటే ఇదేమీ రెగ్యులర్‌గా పనిచేసే రంగం కాదు. పర్మెనెంట్‌ స్టాఫ్ కూడా ఉండరు. వీరి రెమ్యునరేషన్‌లపై ఎవరి కంట్రోల్ ఉండదు. పరిశ్రమ హోదా ఇస్తే ప్రభుత్వం నుంచి తమకు కావల్సినవారికి నిధులు ఇచ్చుకోవచ్చని ఎవరైనా చెప్పారేమో తెలియదు. ఏపీలో షూటింగ్‌ చేస్తే రాయితీలు ఇస్తామని జగన్ చెబితే తప్పని ప్రచారం చేసిన పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్దికి ఏమీ చేయకపోగా.. వారి అంతు చూస్తామంటూ వార్నింగ్ ఇవ్వడం ఏమిటో?. బంద్ ఆలోచన  చేయడం లేదని ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర ప్రసాద్ ప్రకటించినా, పవన్‌లో ఏదో ఆందోళన ఉన్నట్లే కనిపిస్తోంది. అందుకే అధికార దుర్వినియోగం చేస్తున్నారా?. 








::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ జర్నలిస్ట్‌, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)