Breaking News

జైలు నుంచే కామిరెడ్డి పోటీ

Published on Wed, 11/04/2026 - 11:21

తిరుపతి: కూటమి నాయకుల దుర్మార్గాలను నిలదీస్తున్నందుకు అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిని నెల్లూరులోని జిల్లా కేంద్ర కారాగారంలో నిర్బంధించారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. అక్కడి నుంచే నామినేషన్‌ వేసి పెళ్లకూరు జెడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచారు. దాంతో ఆయన భార్య కామిరెడ్డి ప్రభావతమ్మ, కుమార్తె కామిరెడ్డి రజిని స్థానిక నాయకులతో కలిసి గత మూడు రోజులుగా విస్త్రృతంగా ఎన్నికల ప్రచారం చేశారు.

 ఒక పక్క వర్షం, మరో పక్క కామిరెడ్డి జైల్లో ఉన్నాడనే దిగులు... ఏదిఏమైనప్పటికీ అధైర్య పడకుండా గెలుపే లక్ష్యంగా ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు అందించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న సత్యనారాయణరెడ్డితో పాటు పాలచ్చూరు, కలవకూరు ఎంపీటీసీ స్థానాలకు పోటీలో ఉన్న పాలూరు రత్నమ్మ, బండి బాలచంద్రను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గడిచిన నలభైయేళ్లు రాజకీయ ప్రస్థానంలో ఎన్నడూలేని విధంగా కూటమి ప్రభుత్వంలో నాయకులంతా రౌడీలుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

ప్రజాస్వామ్యంలో ఎన్నికల నిబంధనలను అమలు చేయాల్సిన పోలీసులు కూటమి రౌడీలకు వత్తాసుగా పలకడం అన్యాయమన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కూటమి నాయకులు చేస్తున్న దౌర్జన్యాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడొద్దని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు.  

ఇదీ చదవండి: ఒక్క ఓటుతో విజయం


 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)