Breaking News

ఎమ్మెల్యేలు తప్పు చేస్తే నాకు సంబంధం లేదు

Published on Mon, 11/10/2025 - 16:21

సాక్షి, అమరావతి: కూటమి ఎమ్మెల్యేలు ఇక నుంచి చేసే తప్పులకు.. తనకు ఎలాంటి సంబంధం ఉండబోదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ సచివాలయంలో సోమవారం మంత్రివర్గ సమావేశం అనంతరం కూటమి నేతల తీరుపై చర్చ జరిగింది. ఆ భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.  

ఏ పార్టీ ఎమ్మెల్యే తప్పు చేసినా ఇన్‌ఛార్జ్‌ మంత్రులు కఠినంగా వ్యవహరించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సీఎం చంద్రబాబుతో అన్నారు.  దీనికి స్పందించిన చంద్రబాబు ఆ వ్యవహారంతో ఇక తనకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేల బాధ్యత జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే తీసుకోవాలని ఆదేశించారు. 

ఇవాళ మూడున్నర గంటలపాటు మంత్రివర్గ సమావేశం జరిగింది. అంశాలపై చర్చ అనంతరం మంత్రుల వద్ద చంద్రబాబు ఎమ్మెల్యేల పని తీరుపై చర్చ జరిగింది. ఇందులో 48 మంది ఎమ్మెల్యేల పనితీరుపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వాళ్లు తమ పద్దతులు మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అదే సమయంలో.. 

తన పార్టీ ఎమ్మెల్యేల తీరు దారుణంగా ఉందని టీడీపీ అధిష్టానం అంగీకరించింది. ఎమ్మెల్యేల అవినీతి, దోపిడీ బాగోతాలపై అంతర్గతంగా ఓ సర్వే నిర్వహించి.. ఆ నివేదికను తెప్పించుకున్న చంద్రబాబు, లోకేష్‌లు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అనవసరంగా కొందరికి టికెట్లు ఇచ్చామని మంత్రుల వద్ద చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అలాగే యువ తరాన్ని ప్రొత్సహించే క్రమంలో టికెట్లు ఇచ్చామని.. కానీ, ఫస్ట్‌ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లకు మంచి చెడులు తెలియడం లేదంటూ లోకేష్‌ అభిప్రాయపడ్డట్లు సమాచారం.

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)