Breaking News

నీటిని విడుదల చేయకపోతే ఉద్యమం చేస్తాం: హరీశ్‌రావు 

Published on Tue, 04/02/2024 - 12:49

సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా.. రైతులకు అపాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కుందన్నారు. ఆయన సిద్దిపేట కలెక్టరేట్‌లో మాట్లాడారు.

‘నాడు ఉద్యమాల ద్వారా మెల్కొంది బీఆర్ఎస్. కేసీఆర్ పర్యటన తర్వాత నిన్న(సోమవారం) నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 25 వేల నష్ట పరిహారం అందించాలి.100 రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారు. డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తామని చేయలేదు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది.

...బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమే.. భారత రైతు సమితి. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కూడవెళ్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలి. 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. లో వోల్టేజీ కరెంట్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి.

..బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.కాంగ్రెస్ పార్టీ వచ్చినంక నీళ్లు తగ్గినయి, కన్నీళ్లు పెరిగినాయి.  కాంగ్రెస్ పార్టీకి రైతుల కష్టాలు పట్టవు.  రైతులను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు తీరిక లేదా?. బీఆర్ఎస్ పార్టీ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంది’ అని హరీశ్‌రావు అన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)