Breaking News

టీడీపీ నేతల అరాచకం.. వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌పై దాడి

Published on Thu, 07/03/2025 - 21:31

సాక్షి, గుంటూరు జిల్లా: కూటమి ప్రభుత్వంలో హింసాత్మక ఘటనలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ నేతల దుశ్చర్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్‌సీపీ నేత బొనిగల నాగమల్లేశ్వరరావుపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడ్డారు. 

ఓ షాపు దగ్గర టీ తాగుతుండగా కర్రలు, రాడ్డులతో నాగమల్లేశ్వరరావుపై విచక్షంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా టీడీపీ నేతల అక్రమాలను సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ప్రశ్నిస్తున్నారు. అందరూ చూస్తుండగానే నాగమల్లేశ్వరరావును టీడీపీ నేతలు.. రాడ్లు, కర్రలతో దాడి చేశారు. అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన నాగమల్లేశ్వరరావును ఆసుపత్రికి తరలించారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)