Breaking News

‘చంద్రబాబుపై కేసీఆర్‌ మాట్లాడింది వంద శాతం కరెక్ట్‌’

Published on Mon, 12/22/2025 - 13:24

సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్‌సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ అన్నారు. సోమవారం వైఎస్సార్‌సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో  వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. 

ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్‌సీపీలోకి చేరికలు  జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన. 

చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్‌ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన. 

అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. 

కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్‌సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌ ఏమన్నారంటే.. చంద్ర‌బాబు మాట‌లు విని.. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాల‌మూరులో చెరువుల‌ను బాగు చేయాల‌ని కేంద్రానికి మేం అధికారంలో ఉన్న‌ప్పుడు లేఖ‌లు రాశాం. అయితే.. చంద్ర‌బాబు మాట‌లు విని కేంద్రం అన్యాయం చేసింది. క‌నీసం ప‌ట్టించుకోలేదు. బీజేపీ పాల‌కులు శ‌నిలా దాపురించారు.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)