Breaking News

‘‘కేసీఆర్‌పై కోపంతో..’’ కాంగ్రెస్‌ సర్కార్‌పై కేటీఆర్‌, హరీష్‌ ధ్వజం

Published on Tue, 10/21/2025 - 13:28

సాక్షి, హైదరాబాద్‌: ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ లేని కాంగ్రెస్‌ ప్రభుత్వం.. విజయోత్సవాలు చేయడం విడ్డూరంగా ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. మంగళవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఇబ్రహీంనగర్‌ బస్తీ దవాఖానాను సందర్శించి.. అక్కడి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఫిరాయింపుల వ్యవహారంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా ఆయన మండిపడ్డారు. 

కాంగ్రెస్ పార్టీకి అసలు నీతి ఉందా?. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ లిస్ట్‌లో దానం నాగేందర్ పేరు చేర్చటం సిగ్గు చేటు. దానం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని ఎవరు చెప్పారు?. పార్టీ మారలేదని స్పీకర్ దగ్గర అబద్దాలు చెప్తున్నారు. పార్టీ మారినోళ్ళకు సిగ్గు లేదు. ఏ పార్టీలో ఉన్నామో చెప్పే దమ్ము లేదు. ఆ దమ్మే ఉంటే స్వయంగా చెప్పొచ్చు కదా అని కేటీఆర్‌ నిలదీశారు.

AICC అంటే.. ఆల్ ఇండియా కరపర్షన్ కమిటీ. విజయోత్సవాలు ఎందుకు చేయోలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. ప్రజారోగ్యం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెక్కలేదు. రాజకీయాలు కాదు.. ముఖ్యమంత్రి ప్రజల ప్రాణాలను పట్టించుకోవాలి. మున్సిపల్ మంత్రి లేక.. పట్టించుకునే వారు లేక హైదరాబాద్ అనాధగా మారింది. హైదరాబాద్ సిటీ చెత్త చెదారంతో నిండిపోయింది. 

పట్టణంలో ఉండే పేదల కోసమే కేసీఆర్ 450 బస్తీ దవాఖానాలు‌ ఏర్పాటు చేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది. కనీస మందులు కూడా అందుబాటులో లేవు. ఇది ప్రభుత్వానికి గుర్తు చేయటం కోసమే ఆకస్మిక తనిఖీలను చేపట్టాం. బస్తీ దావాఖాన సిబ్బందికి తక్షణమే జీతాలు ఇవ్వాలి‌‌. ఆశా వర్కర్లు, అంగన్ వాడీ సిబ్బందికి జీతాలు పెంచాలి. కేసీఆర్ ముందు చూపుతో.. కరోనా సమయంలో కూడా ప్రజలు వైద్యం కో‌సం ఇబ్బందులు పడలేదు.  వైద్య పరీక్షలు ఉచితంగా చేసే టీ డయాగ్నస్టిక్స్ ను అందుబాటులోకి తీసుకురావాలి నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే.. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మంది దర్నా చేస్తాం అని కేటీఆర్‌ హెచ్చరించారు.

కాంగ్రెస్ పాలనలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసింది: హరీశ్ రావు

అటు శేరిలింగంపల్లి బస్తీ దవాఖానాను పరిశీలించిన తర్వాత హరీష్‌రావు మాట్లాడారు. ‘‘పేదల ఆరోగ్యంపై రేవంత్‌కు శ్రద్ధ లేదు. బస్తీ దవాఖానాల్లో బీపీ మిషన్లు పని చేయడం లేదు. కేసీఆర్‌పై కోపంతో కేసీఆర్‌ కిట్‌ పథకం తీసేశారు. జనం మద్యం తాగాలి.. ఖజానా నిండాలి అన్నదే సీఎం ఆలోచనగా కనిపిస్తోంది అని హరీష్‌ విమర్శించారు.

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)