Breaking News

ప్రధాని మోదీకి ఖర్గే లేఖ.. కౌంటర్‌ ఇచ్చిన నడ్డా

Published on Thu, 09/19/2024 - 11:24

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాసిన లేఖకు బీజేపీ జాతీయ అధక్షుడు జేపీ నడ్డా కౌంటర్‌ ఇచ్చారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఖర్గే ఆందోళన వ్యక్తం చేస్తూ పీఎం మోదీకి లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతపై బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని వారిపై చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే తాజాగా గురువారం ఖర్గే లేఖపై జేపీ నడ్డా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ కౌంటర్‌ లేఖ రాశారు.

‘‘ప్రజలచే పదే పదే తిరస్కరణకు గురైన మీ విఫలమైన ఉత్పత్తి, విధానాలను మెరుగుపరిచి.. రాజకీయ బలవంతంతో ప్రజల ముందుకు తీసుకువెళ్లడానికే మీరు(ఖర్గే) ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఆ లేఖలో మీరు చెప్పిన విషయాలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అనిపించింది. 

మీరు రాసిన లేఖలో రాహుల్ గాంధీ సహా మీ నాయకుల అకృత్యాలను ఉద్దేశపూర్వకంగా మరచిపోయినట్లు అనిపిస్తుంది. ఆ విషయాలను మీ దృష్టికి వివరంగా తీసుకురావాలని భావించా. దేశంలోని పురాతన రాజకీయ పార్టీ ప్రస్తుతం యువరాజు రాహుల్‌ గాంధీ ఒత్తిడితో 'కాపీ అండ్‌ పేస్ట్' పార్టీగా మారిపోవటం బాధాకరం’’ అని  పేర్కొన్నారు.

చదవండి: ‘వారిపై చర్యలు తీసుకోండి’.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Videos

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)