Breaking News

ఆర్టీసీ బిల్లు జాప్యంపై బండి సంజయ్‌ కామెంట్లు

Published on Sat, 08/05/2023 - 14:48

సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కరీంనగర్‌ ఎంపీ  బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు. 

శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్‌ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన. 

ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్‌ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్‌పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన.

ఇదీ చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఇది గుర్తుందా?

Videos

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)