Breaking News

పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే: అంబటి

Published on Fri, 07/10/2026 - 18:19

సాక్షి, తాడేపల్లి: పోర్టులు, భూములను తమ వారికి కట్టబెట్టటానికే చంద్రబాబు కేబినెట్ సమావేశమంటూ వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారంటే ఎంత నాన్ సీరియస్‌గా జరిగిందో అర్థం చేసుకోవచ్చన్నారు. కేబినెట్ సమావేశంలో ప్రజలకు మేలు చేసే అంశాలపై చర్చించటం మానేశారంటూ ఆయన దుయ్యబట్టారు.

‘‘కేబినెట్‌కి డీజీపీ వెళ్లి సోషల్‌ మీడియా కట్టడిపై మాట్లాడటం ఏంటి?. టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో మా పార్టీ నేతలను తిట్టిస్తున్నారు. జుగుప్సాకరంగా పోస్టులు పెట్టిన వారిపై ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేదు. కానీ మావారిపై అక్రమ కేసులు పెట్టి 1,394 మందిని అరెస్టు చేశారు. సోషల్ మీడియా అంటే చంద్రబాబు భయపడిపోతున్నారు. అందుకే టాస్క్ ఫోర్స్ కూడా పెడుతున్నారు. గాదె సాయికృష్ణను దారుణంగా లాకప్‌ డెత్ చేస్తే ఈ డీజీపీ ఎందుకు మాట్లాడలేదు?’’ అంటూ అంబటి ప్రశ్నించారు.

‘‘క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు?. ఇలాంటి వాటిపై కేబినెట్‌లో చర్చించరా?. ఉండవల్లిలో పోలీసు కానిస్టేబుల్ తల పగలకొట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసు పెట్టలేదు?. ఉత్తుత్తి కేబినెట్‌లు కాకుండా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ కేబినెట్‌కి ఎందుకు రావటం లేదు?. ఆ కారణాలు ఏంటో సీఎం, డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి.’’ అని అంబటి నిలదీశారు.

‘‘రావణ్‌కు అన్ని కేసుల్లోనూ బెయిల్ వస్తోందని ఉపా చట్టం ప్రయోగించారు. రావణ్ టీమ్‌లోని ఒక మహిళ జగన్‌ని కలిసి న్యాయ సహాయం కావాలని కోరారు. వైఎస్‌ జగన్ సరే అన్నారు.. అంతే తప్ప రావణ్‌కు మాకు ఎలాంటి సంబంధం లేదు. టీడీపీ కార్యకర్తలు అడిగినా న్యాయ సహాయం చేస్తాం. తీవ్ర వాదుల మీద పెట్టాల్సిన చట్టాన్ని అమాయకులపై పెట్టటం ఏంటి?. పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అంటే ఇదే’’ అంటూ అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)