Breaking News

ఆలస్యం చేయొద్దు.. తక్షణమే టెహ్రాన్‌ను వీడండి.. భారతీయులకు అడ్వైజరీ

Published on Tue, 06/17/2025 - 10:30

టెహ్రాన్‌/న్యూఢిల్లీ: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో భారతీయులకు(Indians In Iran) ఇండియన్‌ ఎంబసీ తాజాగా మంగళవారం మరోసారి అడ్వైజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లోని భారతీయులంతా వెంటనే నగరాన్ని వీడి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. 

ఇప్పటివరకు ఎంబసీని సంప్రదించని భారతీయులు.. తక్షణమే అధికారులతో మాట్లాడి తమ లొకేషన్లను షేర్‌ చేయాలని సూచించింది. ఈ క్రమంలో హెల్ప్‌ లైన్‌ నెంబర్లు +98 9010144557, +98 9128109115, +98 9128109109 లకు తమ వివరాలు తెలియజేయాలని కోరింది. 

ఇరాన్‌ రాజధాని నగరం టెహ్రాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం డ్రోన్లు, మిస్సైల్స్‌తో విరుచుకుపడుతోంది. అమెరికా రాయబార కార్యాలయంతో పాటు పలు కార్యాలయాలను ధ్వంసం చేసింది.  ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి.. ‘‘ఆలస్యం చేయకుండా నగరాన్ని వీడాలి’’ అంటూ భారతీయుల కోసం భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది. 

ప్రస్తుతం ఇరాన్‌లో సుమారు 10,000 మంది భారతీయులు ఉన్నట్లు ఒక అంచనా. వీళ్లలో 6,000 మందికి పైగా విద్యార్థులే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడి భారతీయులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సత్వర చర్యలు ప్రారంభించింది. 

తక్షణమే టెహ్రాన్ నగరం విడిచి వెళ్లాలని భారతీయులకు ఎంబసీ ఆదేశాలు

విమాన మార్గం మూసేయడంతో.. ఇప్పటికే 100 మందితో కూడిన తొలి బృందాన్ని టెహ్రాన్ నుంచి భూమార్గం ద్వారా అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి అజర్‌బైజాన్, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్థాన్ మీదుగా భారత్‌కు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు.. భారత రాయబార కార్యాలయం విద్యార్థులకు కీలక సూచనలు జారీ చేసింది. ఎల్లప్పుడూ టచ్‌లో ఉండాలని, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో సహకరించాలని కోరింది. 

ఇదీ చదవండి: యుద్ధం ముగిసేది అప్పుడే.. ఇజ్రాయెల్‌ స్పష్టీకరణ

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు