Breaking News

షోరూంలో కారు బొక్కాబోర్లా.. స్పందించిన యువతి

Published on Sat, 09/13/2025 - 12:30

నిమ్మకాయ తొక్కించబోయి.. ఓ మహిళా కొత్త కారును ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కింద పడేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ నర్మన్‌ విహార్‌లోని మహీంద్రా షోరూమ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో రూ.27 లక్షల విలువైన థార్‌ వాహనమూ(Thar Rox SUV) నాశనమైంది. అది మీడియా.. అంతకు మించి సోషల్‌ మీడియా దృష్టిని ఈ ఘటన ఆకర్షించింది. దీంతో ఆ కారును పడేసిన మాని పవార్‌ స్పందించింది.  

ఘజియాబాద్‌ ఇందిరాపురం ప్రాంతానికి చెందిన మాని పరివార్‌(29) తన భర్త ప్రదీప్‌తో కలిసి కొత్త కారు కోసం ఢిల్లీ నిర్మాణ్‌ విహార్‌కు వచ్చింది. అక్కడి శివ ఆటో కార్‌ మహీంద్రా షోరూంలో కారు కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లాలనుకుంది. అయితే.. కారును నిమ్మకాయ తొక్కించి షోరూమ్‌ ఫస్ట​ ఫ్లోర్‌ నుంచి కిందకు తీసుకురావాలని ప్రయత్నించింది. ఈలోపు.. 

పొరపాటును ఎక్సలేటర్‌ను బలంగా తొక్కడంతో హఠాత్తుగా కారు ముందుకు దూసుకెళ్లింది. షోరూం ఫస్ట్‌ఫ్లోర్‌ అద్దాలు బద్దలు కొట్టుకుని సినిమాలో యాక్షన్‌ సీన్‌ మాది 15 అడుగుల ఎత్తు ఎగిరి నేల మీద బొక్కబోర్లా పడిపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదం తర్వాత వీడియో వైరల్ అయ్యింది, అందులో కారు తలకిందుగా రోడ్డుపై పడిపోయిన దృశ్యం కనిపించింది. అయితే.. 

సోషల్‌ మీడియాలో మాత్రం మరోలా ప్రచారం జరిగింది. ఈ ఘటనలో మాని పవార్‌ సహా భర్త, షోరూమ్‌ సిబ్బంది గాయపడ్డారని కొందరు, ఆమె ముఖం, ముక్కు పగిలిపోయానని మరికొందరు.. లేదు ఆమె చనిపోయిందంటూ ఇంకొందరు కథనాలు, పోస్టులు ఇచ్చారు. దీంతో మాని పవార్‌ స్పందించారు. నేను బతికే ఉన్నాను. దయచేసి ఫేక్ వీడియోలు పంచుకోవడం ఆపండి అంటూ వీడియో సందేశం ఉంచారామె. 

ఘటన సమయంలో కారులో నాతో పాటు షోరూమ్ సేల్స్‌మన్ వికాస్‌, కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. కారు అధిక ఇంజిన్‌తో పని చేస్తోందని అప్పటికే సేల్స్‌మన్‌ మాకు చెప్పారు. నిమ్మకాయల్ని తొక్కించే పూజ సమయంలో పొరపాటుగా ఎక్స్‌లేటర్‌ తొక్కడం వల్లే జరిగింది. షోరూమ్‌ గ్లాస్‌ బద్దలు కొట్టుకుని మరీ కిందపడిపోయింది.  అదృష్టవశాత్తూ ఎయిర్‌బాగ్స్‌ తెరుచుకోవడం వల్ల మాకేం కాలేదు. సిబ్బంది సాయంతో పగిలిన ముందు భాగం నుంచి అంతా బయటకు వచ్చాం. ఫస్ట్‌ ఎయిడ్‌ తర్వాత ఇంటికి వచ్చేశాం. మేం క్షేమంగానే ఉన్నాం. పుకార్లను, వెటకారాలను దయచేసి ఆపండి. ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం ఇదే’’ అని అన్నారామె. 

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)