Breaking News

పెళ్లి విందు: తుపుక్‌మంటూ రోటీ మీద ఉమ్మేసి

Published on Sun, 02/21/2021 - 13:50

చాలామందికి పెళ్లంటే గుర్తొచ్చేది కమ్మని విందు భోజనమే.. వెజ్‌ అయినా నాన్‌వెజ్‌ అయినా రకరకాల వంటకాలతో వివాహానికి వచ్చినవారి కడుపు నింపుతారు. అందుకే ఎప్పుడైనా పెళ్లికి వెళ్లాల్సి వస్తే ఓ పూట కడుపు ఖాళీగా ఉంచుకుని మరీ విందుకు రెడీ అవుతుంటారు. కానీ ఈ వీడియో చూశాక మాత్రం పెళ్లి భోజనం అంటే బెంబేలెత్తిపోవడం ఖాయం.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ పెళ్లితంతు ఘనంగా జరిగింది. అక్కడికి వచ్చిన అతిథుల కోసం ఓ వ్యక్తి తందూరీ రోటీ చేశాడు. ఆ సమయంలో అతడికి దగ్గర్లో ఇతర వంటగాళ్లు ఎవరూ లేనట్లున్నారు. ఇంతలో అతడు ఎవరూ చూడట్లేదు కదా అన్నట్లుగా ఓ లుక్కిచ్చుకుని రోటీ మీద తుపుక్కుమని ఉమ్మేశాడు. అలా ఏదో ఒకదాని మీద ఉమ్మేసి వదిలేయలేదు. అతడు చేసిన ప్రతి రోటీ మీద ఇలాగే ఉమ్మాడు. దీన్నంతటినీ ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఇంకేముందీ, ఈ వీడియో కాస్త వైరల్‌గా మారగా మీరట్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉద్దేశ్యపూర్వకంగా రోటీని నాశనం పట్టించిన అతడిని మీరట్‌కు చెందిన సోహైల్‌గా గుర్తించారు. ఇక ఈ వీడియో చూసిన జనాలు అతడి నిర్వాకానికి శివాలెత్తిపోతున్నారు. ఛీ ఇదేం గలీజు పనిరా నాయనా అని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అతడికిదేం పోయేం కాలం అని తిట్టిపోస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొంపదీసి ఆ రోటీలను పెళ్లికి వచ్చినవాళ్లు తిన్నారా? ఏంటని ఆరా తీస్తున్నారు.

చదవండి: వైరల్‌: అమ్మాయిని ముద్దు లంచంగా అడిగిన పోలీస్‌

వైరల్‌: వంటకు సాయం చేస్తున్న కోతి!

Videos

స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం

Covid-19 New Variant: తొందరగా సోకుతుంది..

మీరు కూడా పుస్తకాలు తీసి పేర్లు రెడీ చేయేండి..

YSRCP హయాంలో ఈ తరహా రాజకీయాలు చేయలేదు: YS Jagan

పెళ్ళైన రెండో రోజే మృత్యుఒడికి నవవరుడు

LIVE: మనకూ టైం వస్తుంది.. వాళ్లకు సినిమా చూపిస్తాం

MISS INDIA: తిరుమల శ్రీవారి సేవలో మానస వారణాసి

బెంగళూరులో రోడ్లు, కాలనీలు జలమయం

రామగిరి మండలం, గ్రేటర్ విశాఖ కార్పొరేటర్లతో సమావేశం

హీరోయిన్ సాయి ధన్సిక తో విశాల్ వివాహం

Photos

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)

+5

డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)

+5

'వార్‌ 2' మొదలైంది.. టీజర్‌లో ఈ షాట్స్‌ గమనించారా? (ఫోటోలు)

+5

ఐదో రోజు సరస్వతీ నది పుష్కరాలు..భక్తజన సంద్రం (ఫోటోలు)

+5

విశాల్‌తో పెళ్లి.. నటి ధన్సిక ఎవరో తెలుసా (ఫోటోలు)

+5

ముంచెత్తిన కుండపోత.. నీట మునిగిన బెంగళూరు (ఫొటోలు)

+5

జూ.ఎన్టీఆర్ బర్త్ డే.. ఈ విషయాలు తెలుసా? (ఫొటోలు)

+5

పెళ్లయి మూడేళ్లు.. నిక్కీ-ఆది హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)