విజయ్‌ బ్రో.. వెరీ రాంగ్‌ బ్రో!

Published on Fri, 07/24/2026 - 10:31

తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రభావం కొత్త విషయం కాదు. కానీ.. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఓ నటుడిగా విజయ్‌కి ఉన్న క్రేజ్‌ తగ్గలేదు. తాజాగా ఆయన నటించిన ‘చివరి చిత్రం’ జన నాయగన్ విడుదల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. అదే సమయంలో.. ఈ కోలాహలం ఇటు రాజకీయ చర్చకూ దారితీసింది.

‘జన నాయగన్‌’ విడుదల సందర్భంగా విజయ్‌ అభిమానుల నుంచి భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. అయితే ఆ అభిమానంలో పాలకులు సైతం పోటీ పడ్డారు. సినిమా ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో చూసేందుకు తమిళనాడు మంత్రులు, అధికార పార్టీ నేతలు థియేటర్లకు తరలివెళ్లారు. అసెంబ్లీ స్పీకర్‌ నుంచి పలువురు మంత్రుల వరకు సినిమా వేడుకల్లో పాల్గొన్నారు. కొందరు అభిమానులతో కలిసి థియేటర్లలో సందడి చేయగా.. మరికొందరు సోషల్‌ మీడియాలో సినిమాకు ప్రచారం చేశారు.

మంత్రి టీకే ప్రభు సినిమా స్టిక్కర్లను ఇళ్ల తలుపులు, ఆటోలకు అంటించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మరో మంత్రి సినిమా చూస్తూ భావోద్వేగానికి గురైన దృశ్యాలు కూడా వైరల్‌ అయ్యాయి. ఇదే ఇప్పుడు విమర్శలకు కారణమైంది. 

రాష్ట్రంలో కీలక సమస్యలు బోలెడన్ని పెండింగ్‌లో ఉన్నాయని.. పాలనపై దృష్టి పెట్టాల్సిన సమయంలో సినిమా వేడుకలకు ప్రాధాన్యం ఇవ్వడం సరైందేనా? అనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి.

నీట్‌ నుంచి రైతుల వరకు..
నీట్‌పై అభ్యంతరాలతో మొదటి నుంచి కేంద్రం నుంచి పోరాడుతోంది తమిళనాడునే. అసలు ఆ పరీక్షను రద్ద చేయాలనే డిమాండ్‌ మొదలైంది కూడా అక్కడి నుంచే. అలాంటి రాష్ట్రంలో.. నీట్‌ వ్యతిరేక ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్‌ రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ విషయంలో తమది మొదటి నుంచి ఒకే మాట అని విజయ్‌ టీవీకే చెబుతోంది.

అయితే నిరసనల్లో మాత్రం ఆ పార్టీకి చెందిన నేతలెవరూ కనిపించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న వేళ.. విజయ్‌ సినిమా వంకతో పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

మరోవైపు కర్ణాటక మేకెదాటు ప్రాజెక్టు, కావేరీ నీటి విడుదల, డెల్టా రైతుల సమస్యలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సినిమా విడుదల చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించడం విమర్శలకు కారణమైంది.

వెరీ రాంగ్‌ బ్రో.. 
ఇటీవల తమిళనాడులో వరుసగా కస్టడీ మరణాల ఆరోపణలు కలకలం రేపాయి. పోలీసుల వేధింపులతో నలుగురు మరణించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పోలీసు దౌర్జన్యాలపై గళమెత్తిన విజయ్‌.. ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అంశంపై మౌనం పాటిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

గతంలో కస్టడీ బాధిత కుటుంబాలను కలిసిన విజయ్‌.. పోలీసు సంస్కరణలు తీసుకురావాలని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా స్పష్టమైన చర్యలు కనిపించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సినిమా హీరో కావొచ్చు, కానీ..
విజయ్‌ రాజకీయ ప్రయాణం మొత్తం ప్రజా సమస్యల చుట్టూనే సాగింది. అవినీతి, పరిపాలనా లోపాలు, ప్రజల హక్కుల కోసం పోరాడతానని ఆయన ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ముందున్న అసలు పరీక్ష.. అభిమానుల సీఎంగా కాకుండా ప్రజల సీఎంగా నిరూపించుకోవడం. సినిమా విజయోత్సవాలు రాజకీయంగా నష్టం చేయకపోయినా.. ప్రజా సమస్యలపై స్పందన ఆలస్యమైతే ప్రతిపక్షాలకు అది ఆయుధంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా సినీ మత్తు వీడి రంగంలోకి దిగాలనే అభిప్రాయమై వ్యక్తమవుతోంది.

 

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)