Breaking News

సుమారు రూ. 3 లక్షలు : ఉద్యోగులకు టెక్‌ కంపెనీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌!

Published on Tue, 06/16/2026 - 11:48

ఉన్నట్టుండి లేఆఫ్స్‌ చేసే దిగ్గజ టెక్నాలజీ కంపెనీలతో పాటు,  కంపెనీ అభివృద్ధికి పాటుపడిన తన ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఆలోచించి, వారికి భారీ బహుమతులు, ప్రోత్సాహకాలు అందించిన టెక్‌ యజమానులు చాలా మందే ఉన్నారు. కానీ  వినూత్నంగా లోచించిన ఈ స్టార్టప్‌  కంపెనీ ఓనర్‌  మాత్రం చాలా భిన్నం. తన ఎంప్లాయిస్‌కు ఇచ్చిన గిఫ్ట్‌ ఏంటో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే. పదండి మరి అదేంటో తెలుసుకుందాం.

"బిజినెస్ ఇన్‌సైడర్" ప్రకారం కార్యాలయ ప్రయోజనాలను పునఃసమీక్షిస్తున్న తరుణంలో, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అధిపతి తన ఉద్యోగుల శ్రేయస్సు కోసం ఒక వినూత్నమైన పద్ధతిని అవలంబించారు. అందులో భాగంగా  తమ సిబ్బంది కోసం నిద్రకు సంబంధించిన టెక్నాలజీపై వేల డాలర్లను ఖర్చు చేయడం విశేషం.  

ఇదీ చదవండి: షాకింగ్‌ : ఐఏఎఫ్ ఆఫీస‌ర్ భార్యపై అఘాయిత్యం, మత మార్పిడి..!

స్టార్టప్ 'ఫ్యాక్టరీ' (Factory) అధినేత మతాన్ గ్రిన్‌బర్గ్ (Matan Grinberg) తన ఉద్యోగుల పనితీరును మెరుగు పరిచేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అంటే వారి ఆరోగ్యంతోపాటు, తద్వారా వచ్చే ఫలితంపై దృష్టిపెట్టారు. కంపెనీ ప్రారంభ దశలో ఉన్నప్పుడు, ఉద్యోగులందరికీ సుమారు 2,83,746 విలువైన 'ఎయిట్ స్లీప్' (Eight Sleep) ప్రీమియం మ్యాట్రెస్ కవర్లను కానుకగా ఇచ్చారు. కంపెనీలో దాదాపు 30 మంది ఉద్యోగులు ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్స్‌ను పంపిణీ చేశారు. ప్రస్తుతం ఈ స్టార్టప్‌లో 120 మంది ఉద్యోగులు ఉన్నారు, అలాగే కంపెనీకి  150 మిలియన్ల డాలర్ల ఫండింగ్ కూడా లభించిందట.

ఇలా ఇవ్వడానికి కారణమేంటి అంటే.
గ్రిన్‌బర్గ్ తన ఉద్యోగుల విశ్రాంతిని క్రీడాకారుల రికవరీతో పోల్చారు. మెదడు చురుగ్గా పనిచేయడానికి మంచి నిద్ర అవసరమని తాను నమ్ముతా నన్నారు. ప్రతి ఒక్కరూ తమ మెదడులోని ప్రతి అణువు శక్తిని పూర్తిగా వినియోగించుకునేలా చూడాలనుకుంటున్నా అని, అలా చేయాలంటే, వారికి మంచి నిద్ర అవసరమని చెప్పారు.

 ఇదీ చదవండి: ఆమెకు 36, అతనికి 24 : ఇదో విచిత్రమైన పెళ్లి

ఉద్యోగుల పనితీరుపై తన దృష్టి నిద్రకు మాత్రమే పరిమితం కాదని వ్యవస్థాపకుడు చెప్పారు. ఏకాగ్రత మరియు మానసిక చురుకుదనంపై వాటి ప్రభావం గురించి ఆందోళనల కారణంగా, కార్యాలయంలో అధికంగా ప్రాసెస్ చేయబడిన చక్కెర పదార్థాల లభ్యతను తగ్గించడానికి కూడా ఆయన ప్రయత్నించారు. దానికి బదులుగా, కంపెనీ ప్రోటీన్ ఆధారిత స్నాక్స్ , క్యాన్డ్ మాచా పానీయాలతో సహా మరింత ఖరీదైన ప్రత్యామ్నాయాలను అందిస్తుంది. మరో విషయం ఏమిటంటే 2010 నాటి గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు ఆఫీసుల్లో వినోదానికిచ్చిన అనవసరమైన సదుపాయాలను ఆయన తప్పు బట్టారు. అవి ఉత్పాదకతకు ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు. గత దశాబ్దంలో ప్రధాన టెక్నాలజీ సంస్థలతో ముడిపడి, విస్తృతంగా ప్రచారంలో ఉన్న కార్యాలయ సంస్కృతికి తన తత్వం భిన్నంగా ఉంటుందని గ్రిన్‌బర్గ్ నొక్కి చెప్పారు.

రోజుకు అతిగా, నిర్బంధంగా పని చేసే విధానాన్ని "గ్రైండ్‌స్లాప్" (ఉదాహరణకు 996 వర్క్ కల్చర్ ఉదయం 9 నుండి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు పనిచేసే ఒక కఠినమైన పని విధానం. దీని ప్రకారం ఉద్యోగి వారానికి ఏకంగా 72 గంటలు పని చేయాల్సి ఉంటుంది.) విధానాన్ని వ్యతిరేకించారు. "మనమీ డేకేర్ సెంటర్ నడపట్లేదు, ఉద్యోగులు ఇన్ని గంటలు పని చేయాలని రూల్ పెట్టడానికి" అని గ్రిన్‌బర్గ్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:  అఫ్గాన్‌లో సోలో ట్రిప్‌, భారతీయ మహిళ భావోద్వేగం, దురంధర్‌ నటుడు కూడా!

భవిష్యత్తు ప్రణాళికలు
అయితే కొత్తగా చేరిన ఉద్యోగులకు ఇంకా ఈ మ్యాట్రెస్ కవర్లు ఇవ్వలేదు. అయితే, భవిష్యత్తులో దీనిని ఒక శాశ్వత వెల్నెస్ అలవెన్స్‌గా మార్చాలని ఆయన ఆలోచిస్తున్నారు. దీని వల్ల ఉత్పాదకత ఎంత పెరిగిందో ఖచ్చితంగా లెక్కించలేకపోయినా, మంచి నిద్ర వల్ల ఉద్యోగులు మరింత చురుగ్గా, తెలివిగా పనిచేస్తారని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.  సిబ్బంది వాటిని అభినందిస్తున్నారని తనకు తెలుసని గ్రిన్‌బర్గ్  పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!

అలాగే ఒక 'చీఫ్ ఆఫ్ స్టాఫ్'ని నియమించుకునే బదులు, ఆఫీస్ కోసం ఒక ప్రైవేట్ చెఫ్‌ను నియమించుకోవడం లాభదాయకమని భావించారు. 2024లో ఈ వేరబుల్ టెక్నాలజీ కంపెనీ, తమ ఉద్యోగుల సగటు నిద్ర స్కోరు 85 శాతం  దాటితే ప్రతి నెల 100 డాలర్లు బోనస్ ఇస్తామని ప్రకటించడం మరో విశేషం.

కాగా కోవిడ్‌ అనంతరం, ఆరోగ్య రక్షణపైనా అందులోప్రధానమైన నిద్రకు ప్రాధాన్యత  బాగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే నోటికి టేప్ చుట్టే పద్ధతుల నుండి ఓరా రింగ్స్ వరకు, చాలా మంది వినియోగదారులు మెరుగైన నిద్ర నాణ్యతను సాధించే ప్రయత్నంలో సాంకేతికత,జీవనశైలి మార్పుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ  ట్రెండ్‌  ఆన్‌లైన్‌లో "స్లీప్‌మాక్సింగ్" గా (Sleepmaxxing)  పాపులర్‌ ‌ అయిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: పర్మినెంట్‌ రెసిడెంట్‌ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)