Breaking News

షాకింగ్‌ : కట్టేసి, జుట్టు కత్తిరించి, పైశాచికంగా.. వీడియో వైరల్‌

Published on Fri, 06/19/2026 - 14:33

ఛత్తీస్‌గఢ్‌లోని కోరియా జిల్లా పాండోపారా గ్రామంలో  ఒక షాకింగ్‌ ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్య, నలుగురు బిడ్డల తల్లిపై అనుమానంతో భర్త అతి దారుణంగా  ప్రవర్తించిన వైనం దిగ్భ్రాంతి రేపింది. ఈ ఘోరానికి సంబంధించిన వీడియోపై  నెటిజన్ల తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేస్తున్నారు.

రాయ్‌పూర్‌కు ఉత్తరాన సుమారు 350 కి.మీ దూరంలో ఈ ఘటనచోటు చేసుకుంది. బాధితురాలు తారా బాయి (32)కు నిందితుడు జితేంద్ర ఘసియాతో 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.  విబేధాలతో భార్యాభర్త లిద్దరు విడిగా ఉంటున్నారు. అయితే పిల్లలు మాత్రం తండ్రి వద్దే ఉంటున్నారు.

భార్యపై అనుమానంతో అత్యంత అమానుషంగా దాడి చేశాడు జితేంద్ర. చేతులు  కాళ్లు, కట్టేసి  ఆమె పదే పదే దాడి చేశాడు. అనంతరం ఆమె జుట్టును కత్తిరించి తీవ్ర అవమానానికి గురిచేశాడు .ఈ దారుణాన్ని అడ్డుకోవాల్సింది పోయి, మరో మహిళకూడా ఆమెపై చేయి చేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు.  ఈ ఘాతుకాన్ని రికార్డ్ కూడా చేశాడు. 

అసలేం జరిగింది? 
అయితే, ఏడాది క్రితం భర్త ఆమెను వదిలేయడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆమె, తన సామాజిక వర్గానికి చెందిన ఒక పరిచయస్తుడి ఇంట్లో ఆశ్రయం పొందుతోంది. నిందితుడు ఆమెను ఇంటి బయటకు రప్పించి, అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా చంపేస్తానని బెదిరించాడు. ఆ తర్వాత రాక్షసుడిలా మారిపోయాడు.   దారుణంగా  కొట్టి అమానుషంగా ప్రవర్తించడంతోపాటు, మూత్రం తాగించాడు.

 

ఇదీ చదవండి: అచ్చం ఖడ్గం సినిమాలోలా : విద్యావ్యవస్థపై వ్యాపారవేత్త సెటైర్లు

బాధితురాలు ఫిర్యాదు చేయడంతో, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.తనపై పిడిగుద్దులు కురిపించి, తన జుట్టును కత్తిరించారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఆమె భర్తపై క్రిమినల్ కేసు నమోదు చేశారు.  ఘటనా స్థలంలో ఉన్న ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేయడంతోపాటు, వీడియో ఫుటేజీని పరిశీలిస్తున్నామన్నారు.  విచారణ అనంతరం  నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  ఒక పోలీసు అధికారి ప్రకటించారు.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

ఇదీ చదవండి: 60 ఏళ్లకి లవ్‌, 75 రోజులకే పెళ్లి : నటి లవ్‌ స్టోరీ
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)