Breaking News

సుప్రీంకోర్టులో వరవరరావుకు చుక్కెదురు

Published on Fri, 09/19/2025 - 11:32

సాక్షి, న్యూఢిల్లీ: విరసం నేత వరవరరావు(84)కు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. చికిత్స విషయంలో ఆయన వేసిన ఓ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కొట్టేసింది. భీమా కోరేగావ్ కేసులో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అరెస్టైన ఆయన.. కోర్టు షరతులతో ముంబైలో ఉండిపోవాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే..

వయోభారం, అనారోగ్య కారణాల నేపథ్యంలో హైదరాబాద్‌లో చికిత్స తీసుకునేందుకు అనుమతి కోరుతూ ఆయన పిటిషన్‌ దాఖలు చేశారు. ముంబైలో చికిత్సకు అధిక ఖర్చు అవుతోందని.. హైదరాబాదులో  తమ బంధువులు డాక్టర్లైన నేపథ్యంలో అక్కడ  చికిత్స పొందేందుకు అనుమతించాలని ఆయన పిటిషన్‌లో అభ్యర్థించారు. కానీ కోర్టు ఆ అభ్యర్థను తిరస్కరిస్తూ పిటిషన్‌ కొట్టేసింది. 

భీమా కోరేగావ్ హింస కేసులో పూణే పోలీసులు వరవరరావును ఉపా చట్టం కింద 2018 ఆగస్టు 28వ తేదీన అరెస్ట్‌ చేసి తలోజా జైలు(మహారాష్ట్ర)కు తరలించారు. ఆపై నెలలోపే సుప్రీం కోర్టు ఆదేశాలతో హైదరాబాద్‌లోని నివాసానికి తరలించి గృహనిర్బంధం చేశారు. మరో రెండు నెలల తర్వాత కోర్టు అనుమతితో తిరిగి తలోజా జైలుకు తరలించారు. అయితే..

2020 జులైలో ఆయనకు జైలు కరోనా సోకడంతో వరవరరావుకు ఆరోగ్య సమస్యలు తీవ్రతరం అయ్యాయి. ఈ తరుణంలో.. మహారాష్ట్ర హైకోర్టు 2021 ఫ్రిబవరిలో మెడికల్‌ బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో షరతుల మీద ఆయన ముంబైలో అద్దె నివాసంలో ఉన్నారు. అటుపై 2022లో సుప్రీం కోర్టు రెగ్యులర్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ.. ముంబై విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)