పెళ్లి కూతురిపై రూ. 8.5 కోట్ల వర్షం, కట్‌ చేస్తే!

Published on Wed, 02/18/2026 - 15:56

ఆకాశమంత మందిరి, భూదేవి అంత పీట అన్నట్టు జరుగుతున్నాయి ప్రస్తుతకాలంలో పెళ్లిళ్లు. పెళ్లి జీవితంలో ఒక మధుర జ్ఞాపకంగా మిగిలి పోవాలని కోరుకుంటారు ఇందుకోసం చాలా ఆర్భాటాన్ని ప్రదర్శిస్తుంటారు. పంజాబ్ పెళ్లిలో వధువుపై నోట్ల వర్షం  కురిపించిన కుటుంబం చిక్కుల్లో పడింది.

విషయం ఏమిటంటే..తమ ఇంట పెళ్లిన గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆరాటంతో వధువుపై బంధువులు నోట్ల వర్షం కురిపించడం ప్రస్తుతం నెట్టింట తెగ చర్చకు దారి తీసింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 8.5 కోట్ల విలువైన కరెన్సీ నోట్లను పెళ్లి కుమార్తెపై వెదజల్లారంటూ సోషల​ మీడియాలో ఒక  వీడియో తెగ వైరల్‌ అవుతోంది. (జస్ట్‌ అప్పగింతల ముందు తెలిసింది, పెళ్లి రద్దు!)

పంజాబ్‌లోని తర్న్ తరణ్ జిల్లాలో వాలంటైన్స్ డే రోజు ఒక జంట వివాహం చేసుకుంది. వీరి వివాహ రిసెప్షన్ సందర్భంగా పెళ్లికూతురిపై  ఎనిమిదిన్నర కోట్ల రూపాయలను పూలవర్షంలా కురిపించారట. ఇదిఆన్‌లైన్‌లో షేర్‌ అయిన వెంటనే దావానలంలా వ్యాపించింది. అటు వధూవరుల కుటుంబంనుంచిగాన,ఈ ఇటు వివాహంలో పాల్గొన్న ఎవరి నుండి నిజమైన నిర్ధారణ లేనప్పటికీ గ్రాండ్ క్యాష్ పార్టీ  అంటూ నెటిజన్లు  తెగ ట్రోల్‌ చేశారు.

ఇదీ  చదవండి: ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో మరో కలకలం : ఉమ్మెత్త పూలతో అరాచకాలు

రూ. 8.5 కోట్లు కాదు, లక్షలే
ఈ వీడియో వైరల్‌గా మారడంతో వరుడి కుటుంబం స్పందించింది. ఈ వాదనలను వరుడి కుటుంబ సభ్యులు , వివాహ కార్యక్రమ నిర్వాహకులు తోసిపుచ్చారు.ఈ కార్యక్రమంలో జంటపై రూ.3–4 లక్షల నగదును మాత్రమే కురిపించామన్నారు. రూ. 8.5 కోట్లు అని జరుగుతున్న ప్రచారం అవాస్తమని వరుడి సోదరుడు సికందర్ సింగ్ ఖండించారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, DJ కూడా వైరల్ అయిన రూ. 8.5 కోట్ల వాదనను తోసిపుచ్చారు. మొత్తం నగదు సుమారు రూ. 4 లక్షలు అని కొన్ని డాలర్ నోట్లు కూడా ఇందులో ఉన్నాయని చెప్పడం  గమనార్హం

ఇదీ చదవండి: థాయ్‌లాండ్‌లో అరుదైన దృశ్యం : ఇలా వచ్చి..అలా!

 

Videos

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)