Breaking News

అంతర్జాతీయ వేడుకలో మురికి రాజకీయాలా?

Published on Mon, 02/23/2026 - 04:15

మీరట్‌: కాంగ్రెస్‌ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో ఆ పార్టీ కార్యకర్తలు టీ–షర్టులు విప్పేసి నిరసన తెలపడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం గొప్పగా నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాన్ని మురికి రాజకీయాలకు, సిగ్గుమాలిన రాజకీయాలకు కాంగ్రెస్‌ వేదికగా మార్చుకుందని మండిపడ్డారు. 

మోదీ ఆదివారం ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పర్యటించారు. రూ.12,930 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. మీరట్‌ మెట్రో రైలుకు పచ్చజెండా ఊపారు. నమో భారత్‌ రైలును ప్రారంభించారు. మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో విద్యార్థులతో, ప్రయాణికులతో ముచ్చటించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు. కాంగ్రెస్‌ తీరును తప్పుపట్టారు.

 సిద్ధాంతపరంగా ఆ పార్టీ దారుణంగా పతనమైందని మోదీ విమర్శించారు. ‘‘కాంగ్రెస్‌ అన్ని హద్దులూ అతిక్రమించింది. ఆ పార్టీ ప్రవర్తనను దేశవ్యాప్తంగా అందరూ ఆక్షేపిస్తున్నారు. చేసిన తప్పుకు సిగ్గుపడాల్సింది పోయి టీ–షర్టులు విప్పేసి దేశాన్ని కించపర్చిన వారిని కాంగ్రెస్‌ నాయకులు ఆకాశానికి ఎత్తేస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు. ఆ ఘటనను ఖండించిన ఇతర విపక్షాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. ఆయా పార్టీలు సత్యం పక్షాన, దేశ ప్రతిష్ట పక్షాన నిలిచాయని ప్రశంసించారు. 

సొంత దేశాన్ని కించపరుస్తారా?  
‘‘దేశాన్ని అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా పౌరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కానీ మన దేశం విజయాలు సాధిస్తుండడాన్ని కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయి. 80కిపైగా దేశాల ప్రతినిధులు, 20 దేశాల అధినేతలు పాల్గొన్న సదస్సులో చొక్కాలు విప్పేసి నిరసన తెలపడం సమంజసమేనా? కాంగ్రెస్‌ నిజస్వరూపం అందరికీ తెలుసు. చొక్కాలు విప్పి నగ్నంగా మరోసారి బహిర్గతం చేసుకోవాల్సిన అవసరమేమిటి? కాంగ్రెస్‌ దుస్థితిని నేతల చేష్టలను బట్టి అర్థం చేసుకోవచ్చు. సొంతదేశాన్నే కించపర్చే స్థాయికి దిగజారారు. 

ఒక ఊళ్లో పెళ్లి జరిగితే ఊరి వాళ్లంతా కలిసి దాన్ని వైభవంగా నిర్వహిస్తారు. వచ్చిన అతిథులు సంతృప్తిగా తిరిగివెళ్తారు. మన దేశంలో మనం నిర్వహించుకొనే కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిన అవసరం లేదా? కాంగ్రెస్‌ నేతలు మోదీని ద్వేషించవచ్చు. నా సమాధిని తవ్వాలని అనుకోవచ్చు. నా తల్లిని దూషించవచ్చు. బీజేపీని, ఎన్డీయేను వ్యతిరేకించవచ్చు. వారి రాజకీయాలకు అది అవసరం కావొచ్చు. దాన్ని అర్థం చేసుకోగలం, సహించగలం. కానీ ఏఐ సదస్సు బీజేపీ కార్యక్రమం కాదని కాంగ్రెస్‌ గుర్తుంచుకోవాలి. అక్కడ బీజేపీ నేతలెవరూ లేరు. అది ప్రభుత్వ కార్యక్రమం. దేశ ప్రతిష్టను దెబ్బతీయడం సహించరాని విషయం’’ అన్నారు. 

మహిళలను ముందు పెట్టి రాజకీయమా? 
కాంగ్రెస్‌ తీరుతో పార్లమెంట్‌ కార్యకలాపాలు  సజావుగా జరగడం లేదని మోదీ ఆక్షేపించారు. ‘‘కాంగ్రెస్‌ సభ్యులు సృష్టిస్తున్న అలజడి కారణంగా ఆ పార్టీ మిత్రపక్షాలకు సభలో మాట్లాడే అవకాశం రావడం లేదు. ఫిబ్రవరి 4న లోక్‌సభలో ప్రధాని స్థానాన్ని కాంగ్రెస్‌ సభ్యులు చుట్టుముట్టి నినాదాలు చేయడం, బ్యానర్లు ప్రదర్శించడం సిగ్గుచేటు. వాళ్లు నిజంగా ప్రధాని స్థానంలో కూర్చోవాలనుకుంటే ముందు ప్రజల హృదయాలు గెల్చుకోవాలి.

 మహిళా ఎంపీలను ప్రధాని స్థానం వద్దకు పంపి నినాదాలు చేయిస్తే ప్రధాని అయిపోతారా? మహిళలను ముందు పెట్టి రాజకీయం చేయడమేమిటి? మీలో చేవ చచ్చిపోయిందా? కాంగ్రెస్‌ ఈ దేశానికి పెద్ద భారంగా మారింది. నీచ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలకు గతంలోనే సూచించా. 

అభివృద్ధి గురించి మాట్లాడాలని చెప్పా. అయినా బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వానికి దేశ అభివృద్ధి, ప్రజల సౌభాగ్యమే ముఖ్యమన్నారు. ‘‘యూపీ ప్రగతికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. దశాబ్దాల క్రితం అరాచకానికి మారుపేరుగా ఉన్న యూపీ ఇప్పుడు అభివృద్ధి బాటలో పరుగులు తీస్తోంది’’ అని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అత్యంత వేగవంతమైన మీరట్‌ మెట్రో   
ఢిల్లీ–మీరట్‌ నడుమ 82 కిలోమీటర్ల రీజినల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టం (ఆర్‌ఆర్‌టీఎస్‌)లో మిగతా మార్గాలతోపాటు 23 కిలోమీటర్ల మీరట్‌ మెట్రోను ప్రధాని మోదీ ఆదివారం ప్రారంభించారు. ఇది దేశంలోనే అత్యంత వేగవంతమైన మెట్రోగా చెబుతున్నారు. ఢిల్లోలో సరాయ్‌ కాలేఖాన్, న్యూ అశోక్‌నగర్‌ మధ్య 5 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్‌ సౌత్‌ నుంచి మోదీపురం దాకా 21 కిలోమీటర్ల మార్గాన్ని, మీరట్‌ సౌత్‌ నుంచి శతాబ్దినగర్‌ స్టేషన్‌ దాకా మెట్రో సెక్షన్‌ను ప్రారంభించారు.

 దీంతో ఢిల్లీ నుంచి మీరట్‌ వరకు ప్ర యాణం గంటలోపే పూర్తవు తుంది. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ఈ రైలుమార్గాన్ని అభివృద్ధి చేశారు. అలాగే మీరట్‌ సౌత్‌ నుంచి మోదీపురం దాకా మెట్రో రైలును ప్రారంభించారు. ఈ మార్గం పొడవు 23 కిలోమీటర్లు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో మెట్రో రైలు ప్రయాణిస్తుంది. మీరట్‌ సౌత్‌ నుంచి మోదీపురానికి 30 నిమిషాల్లోపే చేరుకోవచ్చు.  

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)