Breaking News

లోక్‌సభ నుంచి విపక్షాలు వాకౌట్‌

Published on Mon, 07/01/2024 - 09:46

ఢిల్లీ: లోక్‌సభ సమావేశాల్లో సోమవారం ‘నీట్‌’ మంటలు పుట్టాయి. సభలో ఒకరోజు నీట్‌పై చర్చజరగాలని విపక్షాలు పట్టుపట్టాయి. నీట్‌పై చర్చ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అనుమతి ఇవ్వకపోవటంతో ప్రతిపక్ష సభ్యులు వాకౌట్‌ చేశారు.

లోక్‌సభ ప్రారంభం అయ్యాక రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను అనురాగ్ ఠాకూర్ ప్రారంభించారు. సభ ప్రారంభమైన తర్వాతే గందరగోళం చోటు చేసుకుంది. నీట్‌ పరీక్ష పేపర్‌ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టుపట్టాయి. ఎన్‌టీఏ వైఫల్యాలపై చర్చించాలని కాంగ్రెస్‌ ఎంపీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైక్‌ స్విచ్‌ ఆఫ్‌ చేయటంపై స్పీకర్‌ ఓం బిర్లా వివరణ ఇచ్చారు. విపక్షాల గొంతు నొక్కుతున్నారన్న విమర్శలపై ఆయన స్పందిస్తూ.. రాజ్యాంగ ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం సరికాదన్నారు.

ఒకరోజు నీట్‌పై చర్చకు అవకాశం ఇవ్వాలన్న ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పీకర్‌ను కోరారు. ‘విద్యార్థులకు పార్లమెంట్‌ వేదికగా భరోసా ఇవ్వాల్సిన  అవసరం ఉంది. ఒక్కరోజు నీట్‌పై చర్చించాలి. ఇది 20 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. 
రాష్ట్రపతి ధన్యవాద తీర్మానం తర్వాత అయినా ఒక రోజు నీట్‌పై చర్చ జరపాలి’ అని రాహుల్‌ గాంధీ తెలిపారు. రాహుల్‌ గాంధి చెప్పిన అంశంపై స్పీకర్‌ ఓం బిర్లా స్పందించారు. నీట్‌ అంశంపై బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. నీట్‌పై చర్చకు స్పీకర్‌ ఓం బిర్లా అనుమతించకపోవటంతో విపక్షాలు వాకౌట్‌ చేశాయి.

దీనికంటే ముందు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌  మాట్లాడుతూ.. ముందు రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మాణంపై చర్చించాలన్నరు. తర్వాత అన్ని అంశాలపై చర్చకు సిద్ధమేనని తెలిపారు. లోక్‌ సభ రూల్స్‌ ప్రకారం నడుస్తోందని, రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానం అడ్డుకోవటం సరికాదన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)