Breaking News

మాస్క్‌తో పలాష్‌ : ప్రేమానంద్‌ మహారాజ్‌ని ఎందుకు కలిశాడు?

Published on Wed, 12/03/2025 - 15:58

స్టార్‌ క్రికెటర్ స్మృతి మంధానతో సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ (Palaash Muchhal) వివాహం వాయిదా పడిన నేపథ్యంలో ఇంకా భారీ ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డిసెంబరు 7న  వీరిద్ధరూ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకార్లు వ్యాపించాయి. అలాంటిదేమీ లేదని స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన కొట్టి పారేశారు. ఈ ఊహాగానాల  మధ్య  పెళ్లిలో అనారోగ్యం, పెళ్లి వాయిదా తరువాత  పలాష్‌ తొలిసారి తన కుటుంబంతో విమానాశ్రయంలో కనిపించాడు.

ఇంతకీఅతను ఎక్కడి వెళ్లాడు అనేది హాట్‌ టాపిక్‌గా మారింది. విమానాశ్రయంలో తన కుటుంబంతో మొదటిసారి కనిపించిన తర్వాత, పలాష్  ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో శ్రీ హిట్ రాధా కేలి కుంజ్‌లో ప్రేమానంద్ మహారాజ్‌ (Premanand Maharaj )ను సందర్శించు కున్నారు. తెల్ల చొక్కా, నల్ల జాకెట్ ధరించి, చేతులు ముడుచుకుని ముందు వరుసలో కూర్చుని  ఫోటోల వైరల్‌గా మారింది. అంతకుముందు, ముంబై విమానాశ్రయంలో ఆయన అంతే దిగులుగా కనిపించిన పలాష్‌ ఇక్కడ ముఖానికి మాస్క్‌తో,   భక్తితో నమస్కరిస్తూ కనిపించాడు.

చదవండి: జస్ట్‌ రూ. 200తో మొదలై రూ. 10 కోట్లదాకా ఇంట్రస్టింగ్‌ సక్సెస్‌ స్టోరీ

కాగా  మెహిందీ, సంగీత్‌ వేడుకల మధ్య మహారాష్ట్రలోని సాంగ్లిలో నవంబర్ 23న వివాహం చేసుకోవాల్సిన స్మృతి-పలాష్‌ పెళ్లి  స్మృతి తండ్రి అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. ఆ తరువాత పలాష్‌ ప్రైవేట్‌ చాట్స్‌, స్క్రీన్‌షాట్‌లు అంటూ  మరికొన్ని పుకార్లు షికార్లు చేశాయి. దీనిపై ఇరు కుటుంబాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో  సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ఇదీ చదవండి: రిటైర్డ్‌ డాక్టర్‌ లక్ష్మీ బాయ్‌ రూ. 3.4 కోట్ల భారీ విరాళం

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)