నీట్‌ సెగ.. ధర్మేంద్ర ప్రధాన్‌పై కీలక నిర్ణయం?

Published on Sat, 07/25/2026 - 12:23

నీట్‌-యూజీ పరీక్షలో అవకతవకలు, పేపర్‌ లీక్‌ ఆరోపణల వ్యవహారం కేంద్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగా.. కేంద్రం వరుస చర్యలు చేపట్టింది. ఎన్‌టీఏలో మార్పులు, ఉన్నతాధికారుల బదిలీలు, కఠిన చట్టపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ.. నిరసనలు మాత్రం తగ్గడం లేదు. కీలకమైన మూడు డిమాండ్లలో.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అంశమే ప్రధాన చర్చనీయాంశంగా మారింది.

నీట్‌ వ్యవహారంలో నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధానేనని అటు విద్యార్థి సంఘాలు.. నిరసనకారులు, ఇటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్‌ చేస్తున్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ పదవి నుంచి తప్పుకుంటేనే తమ పోరాటానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆందోళనలు విరమిస్తామని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరుణంలో.. 

ధర్మేం‍ద్ర ప్రధాన్‌ను తప్పించేందుకు కేంద్రం సుముఖంగా కనిపించడం లేదని సమాచారం. ఇదే ప్రధాన ఎజెండాగా నిన్న కేబినెట్‌ భేటీలోనూ చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వివాదం నేపథ్యంలో ఆయన్ని మరో శాఖకు మార్చే అవకాశం ఉందన్న ప్రచారం ఢిల్లీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రాజకీయ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా శాఖ మార్పును పరిశీలిస్తున్నారనే వాదనలు వస్తున్నాయి. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే ఇదే విషయాన్ని రాహుల్‌ గాంధీ ఈ ఉదయం ప్రెస్‌మీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించారు. 

నీట్‌ వివాదంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించిన ఆయన.. మరో శాఖకు మార్చడం పరిష్కారం కాదని అన్నారు. విద్యార్థులు కోరుకుంటున్నట్లు ఆయనను కేబినెట్‌ నుంచి తొలగించాల్సిందేనని డిమాండ్‌ చేశారు. పైగా ఈ వ్యవహారంపై తనకు సమాచారం ఉందని పేర్కొన్న ఆయన.. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న పరిణామాలకు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు. అర్ధరాత్రి వీడియోలు చేయడంతో లాభం లేదని.. మంత్రిని తొలగించి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం నీట్‌ వివాదం నేపథ్యంలో పలు చర్యలు చేపట్టింది. పేపర్‌ లీక్‌ కేసులను త్వరగా విచారించేందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. పరీక్షల నిర్వహణలో అక్రమాలను అరికట్టేందుకు పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అలాగే పరీక్షల నిర్వహణ సంస్థ అయిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ)లో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఎన్‌టీఏలోని 47 మంది అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. నీట్‌ వివాదం వేళ కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వినీత్‌ జోషిని కూడా బదిలీ చేసింది. ఆయన స్థానంలో కొత్త అధికారిని నియమించింది.

అయితే ఈ చర్యలు విద్యార్థుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయాయి. పరీక్షల నిర్వహణలో జరిగిన తప్పిదాలకు కేవలం అధికారులపై చర్యలు తీసుకోవడం సరిపోదని, రాజకీయ బాధ్యత కూడా ఉండాలని సీజేపీ, ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో విద్యార్థి సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మూడో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఎలాంటి హామీలు ఇస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మంత్రి రాజీనామా డిమాండ్‌పై మాత్రం విద్యార్థులు వెనక్కి తగ్గడం లేదు.

ఈ పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్‌ శాఖ మార్పు జరుగుతుందా? లేదంటే ప్రస్తుత పరిస్థితినే కొనసాగిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు విద్యార్థులు రాజీనామా డిమాండ్‌పై పట్టుబడుతుండగా.. మరోవైపు కేంద్రం మాత్రం ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. నీట్‌ వివాదం రాజకీయంగానూ, పరిపాలనా పరంగానూ మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.

Videos

600 మంది సచివాలయ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

ప్యారడైజ్ సినిమాను వీక్షించిన కేటీఆర్

మిమ్మల్ని నమ్మి భూమి ఇస్తే... TDP బండారం మొత్తం బయటపెట్టిన అమరావతి రైతు

NTR జిల్లాలో YS జగన్ పాటలతో గణేశ్ నిమజ్జనం

చింతమనేని నీకే చెప్తున్నా.. దెందులూరు గడ్డ సాక్షిగా.. అబ్బాయి చౌదరీ నెక్స్ట్ లెవెల్ వార్నింగ్

ఒక్కొక్కడికి ఇదే చెప్పడం.. వంగవీటి ఆశ మాస్ వార్నింగ్

తండ్రీ కొడుకుల రహస్య ప్రయాణాలు

విజయవాడ ధర్నా చౌక్ వద్ద హైటెన్నన్.. YSRCP నేతలు VS పోలీసులు

వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి

మంత్రి నారాయణ పై సిట్ విచారణ జరపాలి అమరావతి రైతుల కీలక డిమాండ్

Photos

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)

+5

ఖైరతాబాద్ గణేశుడి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

హైదరాబాదులో వినాయక నిమజ్జనం సందడి..(ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి నిమజ్జనం దృశ్యాలు..(ఫొటోలు)