Breaking News

వాట్‌ ఏ కమిట్‌మెంట్‌ బ్రో.. వైరల్‌ వీడియో

Published on Thu, 01/22/2026 - 16:49

ఒక ముఖ్యమైన కార్యక్రమాన్ని తన కెమెరాలో బంధించేందుకు కెమెరామెన్లు పడే కష్టం మామూలుది కాదు. ప్రోగ్రాం ఏదైనా కీలకమైన అంశాలను కవర్‌ చేస్తూ నానా కష్టాలు పడుతూ ఉంటారు.  పండుగైనా, వేడుకైనా  వీడియో గ్రాఫర్లది చాలా ప్రత్యేక మైన పాత్ర. ఇందులో సందేహమేలేదు. ఉద్యమం అయినా, ఉపద్రవం అయినా, వానొచ్చినా, వరదొచ్చినా వెరవకుండా నిబద్ధతతో పనిచేయాల్సి ఉంటుంది.  ఇలాంటి నిబద్ధతకు సంబంధించి ఒక వీడియో నెట్టింట  తెగ సందడి చేస్తోంది.

పెళ్లికూతుర్ని వేదికకు వద్దకు తీసుకొస్తున్నారు తల్లిదండ్రులు. సిగ్గుల మొగ్గవుతూ, కాబోయే భర్తను చూస్తూ మెల్లిగా అడుగులు వస్తోంది అమ్మాయి. మరోవైపు ఈ క్షణాలకోసమే ఎదురు చూస్తున్నా అన్నట్టు వరుడు కూడా ముందుకునడిచివస్తున్నాడు. ఈ అపురూపమైన దృశ్యాల్ని తన కెమెరాలో బంధిస్తూ వీడియో తీస్తున్నాడు ఒక కెమెరామెన్‌. అతని దృష్టి అంతా అక్కడున్న వేడుక మీదే.  ఏ చిన్న మెరుపు క్షణాన్ని కూడా మిస్‌ అవ్వకూడదు. అదీ అతని కమిట్‌మెంట్‌. ఈ ధ్యాసలో వెనుక వున్న పూల్‌ని చేసుకోలేదు. దీంతో కాలు పట్టు తప్పి ఒక్క ఉదుటున అందులో పడిపోయాడు.  

కానీ ఏమాత్రం తొట్రుపడలేదు. పైగా ‘‘మీరు కానివ్వండి...’’ అంటూ వధూవరులకు, ఇతరులకు ఆదేశాలిస్తూ, తన పనిలో తాను నిమగ్నమైపోయాడు. దీంతో అతనికి సాయం చేద్దామని వచ్చిన మరో కెమెరామెన్‌ తన పనిలో మునిగిపోయాడు. అటు పెళ్లి కొడుకు కూడా కెమెరామెన్‌ ఇచ్చిన ధైర్యంతో వధువుకి ఉంగరం తొడిగే పనిలో ముందుకు కదిలాడు. ఈ వీడియో ఫన్నీ కమెంట్లతో  నెట్టింట వైరల్‌ అవుతోంది. వాట్‌ ఏ కమిట్‌మెంట్‌ బ్రో అని నీ డెడికేష్‌కి సలాం అంటూ  నెటిజన్లు వ్యాఖ్యానించారు. 

నిన్నగాక మొన్న పెళ్లి : చిలకా గోరింకల్లా ఉండాల్సిన వాళ్లు

ఇదీ చదవండి : అనంత్‌ అంబానీ మరో లగ్జరీ వాచ్‌, అదిరిపోయే డిజైన్‌, ధర ఎంత?
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)