Breaking News

కేతన్‌ హత్య : కోడ్‌వర్డ్స్‌ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’

Published on Sat, 07/04/2026 - 11:57

పుణె  రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సియా గోయల్ మొబైల్ ఫోన్‌లో పోలీసులు డిజిటల్ చాట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ‘సీక్రెట్ చాట్స్’ సరికొత్త మలుపుగా మారాయి. అసలు కోడ్‌వర్డ్స్‌ ఎమోజీల అర్థం ఏంటో తెలియక పోలీసులే తలలు పట్టుకుంటున్నారు.  

పోలీసులు సమాచారం ప్రకారం పోలీసులు స్వాధీనం చేసుకున్న చాట్లలోరహస్య కోడ్‌వర్డ్‌లు, మారుపేర్లు , ఎమోజీలు  కోకొల్లలుగా  ఉన్నాయి. వీటి అర్థం కేవలం నిందితులకు మాత్రమే తెలుసని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. సియా గోయల్‌కు చెందిన రెండో మొబైల్ ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) పరిశీలనకు పంపారు. మరోవైపు నిందితులను మరింత విచారించేందుకు పోలీసు కస్టడీని పొడిగించాలని ప్రాసిక్యూషన్ కోరినప్పటికీ, కోర్టు అందుకు నిరాకరించింది. నిందితులు సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిలను జూలై 16 వరకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ ఎ.ఎమ్. విభూతే ఆదేశాలు జారీ చేశారు. 

ఇదీ చదవండి: పెళ్లై నాలుగు నెలలే.. యాసిడ్‌ తాగించి, కన్న కొడుకు హత్య

నిందితులు హత్యకు ముందు రిహార్సల్ చేసినట్లుగా భావిస్తున్న ప్రదేశంలో పోలీసులు 'పంచనామా' నిర్వహించారు. అలాగే ముంబై వైపు వెళ్తుండగా కేతన్ అగర్వాల్ పాస్‌పోర్ట్‌ను పడేసిన చోట కూడా పంచనామా పూర్తి చేశారు. కేతన్ అగర్వాల్ నుండి సియా గోయల్‌కు బదిలీ అయిన డబ్బుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్‌.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్‌!

కాగా కేతన్ అగర్వాల్, సియా గోయల్‌లకు ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. అయితే జూన్ 18న పుణె జిల్లాలోని లోహగఢ్ కోటపై నుండి కేతన్‌ను కిందకు తోసి సియా గోయల్, చేతన్ చౌదరిలు హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.  ఇప్పటికే  నాలుగు సార్లు కేతన్‌పై హత్యా యత్నం సహా అనేక సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి.

ఇదీ చదవండి: కేతన్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ : రూ. 10 కోట్ల డిఫమేషన్‌

ఇదీ చదవండి: ఉద్యోగం Vs సంసారం : సింగిల్‌ మదర్‌ సునీత సక్సెస్‌ స్టోరీ

 

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)