Breaking News

కాన్పూర్‌ కవలల విషాదం, షాకింగ్‌ విషయాలు వెలుగులోకి

Published on Mon, 04/20/2026 - 15:06

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌, కిద్వాయ్ నగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన సభ్యసమాజాన్ని ఉలిక్కిపడేలా చేసింది.  భార్య మీద అనుమానంతో 11 ఏళ్ల కవల కుమార్తెల గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ విషాదకర ఘటనలో మరిన్ని షాకింగ్‌ వివరాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ హత్యల కోసం అతను ఒక రోజు ముందే కత్తిని కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కొన్ని నెలల క్రితం తల్లి మరణించినప్పటి నుండి శశి రంజన్ తీవ్రమైన డిప్రెషన్‌లో ఉన్నాడు. మద్యానికి , నిద్రమాత్రలకు బానిసయ్యాడు. దీనికితోడు భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భార్యమీద అనుమానం పెంచుకున్నాడు. భార్యను ఇంటి నుండి వెళ్ళిపోమని, కుమార్తెలను తనే పెంచు కుంటానంటూ తరచూ గొడవ పడేవాడు. 

ఆర్థిక ఇబ్బందులు
నిందితుడు ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలనుకున్నాడు. అదీ కుదరలేదు. భార్య కూడా నిరుద్యోగి కావడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి.

ఉరితీయండి - తల్లి కన్నీరుమున్నీరు
సీతాకోక చిలుకల్లా కళ్లముందే తిరుగాడే  11 ఏళ్లు ఎదిగిన ఆడపిల్లల్ని  పోగొట్టుకున్న తల్లి  తీరని శోకంతో తల్లిడిల్లిపోతోంది. "అతన్ని వెంటనే ఉరి తీయండి" అంటూ తల్లి రేష్మ కన్నీరుమున్నీరవుతోంది. గతంలోనే అతను పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడని వాపోయింది. 

ఘటన పూర్వాపరాలు 
కాన్పూర్‌కు చెందిన శశి రంజన్ మిశ్రా (45), రేష్మ దంపతులకు 11 ఏళ్ల కవల కుమార్తెలు రిద్ధి, సిద్ధి, ఆరేళ్ల కుమారుడు ఉన్నారు. రాత్రి అందరూ కలిసి భోజనం చేసి, ఎప్పటిలాగానే నిద్రపోయారు. కానీ తెల్లవారేసరికి తన బిడ్డలు ప్రాణాలతో లేరన్న వార్త  తల్లి  గుండెల్ని బద్దలు చేసింది. తన కుమారుడితో కలిసి వేరే గదిలో పడుకోగా, తెల్లవారుజామున పోలీసులు తలుపు తట్టే వరకు ఇంట్లో ఇంతటి ఘోరం జరిగిందన్న సంగతి తెలియదు.

నిందితుడు శశి రంజన్ తన కుమార్తెల ఆహారంలో నిద్రమాత్రలు కలిపి, వారు స్పృహ కోల్పోయిన తర్వాత మొదట గొంతు పిసికి, ఆపై మాంసం కోసే కత్తితో (Cleaver) వారి గొంతులు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత, అతనే స్వయంగా ఉదయం 4:30 గంటలకు 112 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.   

ఇదీ చదవండి: విమానంలో సాంకేతికలోపం... హడలిపోయిన ప్రయాణీకులు

సీసీటీవీ  నిఘా, దృశ్యాలు 
మరో షాకింగ్‌ విషయం ఏమిటంటే భార్యపై అనుమానంతో శశి రంజన్ ఇల్లంతా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశాడు.  వీరి కుమార్తెలకు సాధారణంగా తండ్రితోనే నిద్రపోవడం  అలవాటు. అయితే తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో నిందితుడు ఒక కుమార్తెను బాత్‌రూమ్‌కు తీసుకెళ్లి, తిరిగి వచ్చి గదిలో లైట్లు ఆపివేయడం భార్య తన గదిలోని సీసీటీవీ ఫీడ్‌లో చూసింది. ఆ తర్వాత ఆమె నిద్రపోయింది. కానీ ఇంత ఘోరం జరుగు తుందని ఊహించలేదు.

మనసెలా ఒప్పింది..
ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.  కన్న కూతుళ్లను మట్టు బెట్టేందుకు మనసెలా ఒప్పిందిరా నాయనా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ప్రస్తుతం పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. నిందితుడు ఏదైనా మానసిక చికిత్స పొందుతున్నాడా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి : విషాదం : టీవీ నటుడు సిద్ధార్థ్‌ కన్నుమూత

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)