Breaking News

మరోసారి సీజేపీ ‘జంతర్ మంతర్’

Published on Thu, 11/05/2026 - 20:13

కొచ్చి: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్‌)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మరోసారి ఆందోళనకు సిద్ధమైంది. ఈ నెల 7న కేరళలోని కొచ్చిలో ‘జంతర్ మంతర్ ఎట్ కొచ్చి’ పేరుతో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు సీజేపీ ప్రకటించింది. కొచ్చిలోని రాజేంద్ర మైదాన్‌లో సాయంత్రం 4 గంటలకు ఈ నిరసన కార్యక్రమం ప్రారంభం కానుంది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తన పదవి నుంచి దించే వరకూ తమ పోరాటం ఆపమని గంతంలోనే తేల్చి చెప్పిన నేపధ్యంలో జరగనున్న ఈ నిరసన కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.

ఈ నిరసన కార్యక్రమంలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే పాల్గొననున్నారు. ఆ పార్టీ దక్షిణ జోన్ నాయకుడు విజయ్ మల్లంగి, జాతీయ కార్యదర్శి అఫ్రీన్ నవాజ్ కూడా హాజరుకానున్నట్టు సమాచారం. ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సీజేపీ పిలుపునిచ్చింది.

ఇటీవల ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎస్ఐఆర్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టేందుకు ప్రయత్నించిన సీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం జంతర్ మంతర్‌ను నిరసన ప్రదేశాల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అంతేకాదు అక్కడ జాతీయ జెండాలతో నిరసన తెలిపిన సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను అరెస్టు చేసి వారం రోజుల తర్వాత విడుదల చేశారు.

ఆ సమయంలో అభిజీత్ దీప్కేని కూడా ఢిల్లీలో అరెస్టు చేశారు. అనంతరం ఆయన షరతులతో కూడిన బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే ఆయనకు ఏడాది పాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకూడదనే షరతును విధించారు. కాగా నవంబర్ 1న ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ర్యాలీకి సీజేపీ మద్దతు ప్రకటించినప్పటికీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో రాంలీలా మైదాన్‌లో జరిగిన ర్యాలీలో ఆ పార్టీ పాల్గొనలేదు.

ఇదీ చదవండి: హర్మూజ్ జలసంధిలో భారత్‌, చైనాకు ఇరాన్ కీలక మినహాయింపు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)