Breaking News

అన్నివిధాలా పైచేయి 

Published on Mon, 05/12/2025 - 05:14

న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్‌ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్‌ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే.

 లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్‌ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ  నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్‌ ఆక్రమిత కశీ్మర్‌ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. 

‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్‌ హాహాకారాలు 
పాక్‌ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్‌ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్‌ తేల్చిచెప్పింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)