Breaking News

జస్ట్‌ మిస్‌ భయ్యా.. అదృష్టం అంటే వీరిదే..

Published on Sat, 01/10/2026 - 19:08

బెంగళూరు: కొన్ని సందర్భాల్లో నువ్వు లక్కీ ఫెలో రా.. అని అంటుంటాం కదా.. సరిగ్గా అలాగే ఓ బ్యాచ్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎందుకు అనుకుంటున్నారా?.. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వెళ్లి వారి వైపు దూసుకొచ్చింది. సెకన్ల వ్యవధిలో వారు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది.

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని ఇందిరానగర్‌లో డెరిక్ టోనీ(42) ఫుల్లుగా మద్యం సేవించి తన స్కోడా కారు డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్లాడు. 18వ మెయిన్ రోడ్డు నుండి 100 అడుగుల రోడ్డు వైపు వెళ్తున్నాడు. ఇంతలో మద్యం మత్తులో కారుపై నియంత్రణ కోల్పోయి.. రోడ్డు వద్ద ఎడమ వైపునకు తిరగాల్సి ఉండగా నేరుగా డ్రైవ్‌ చేశాడు. దీంతో, అతి వేగంలో ఉన్న కారు ఒక్కసారిగా డివైడర్‌పై నుంచి సినిమా రేంజ్‌లో జంప్‌ చేసి అవతలి వైపునకు దూసుకెళ్లింది.

ఈ క్రమంలో రోడ్డుపై వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, చివరకు అక్కడే ఉన్న ‘బార్బెక్యూ నేషన్’ రెస్టారెంట్ గోడను బలంగా ఢీకొట్టి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెస్టారెంట్ గోడ పూర్తిగా దెబ్బతినింది. ప్రమాదం శుక్రవారం రాత్రి 11:35 గంటల సమయంలో కొందరు వ్యక్తులు రెస్టారెంట్‌లో డిన్నర్ ముగించుకుని బయట నిలబడి ఉన్నారు. వారిపై కారు దూసుకెళ్లినప్పటికీ సెకన్ల వ్యవధిలో అప్రమత్తమైన బ్యాచ్‌.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ భారీ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

ఇక, ఈ ఘటనలో కారు ఢీకొట్టిన బైక్‌ను నడుపుతున్న జాబిర్ అహ్మద్ అనే వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. అతడిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న జీవన్ భీమా నగర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం సేవించి కారు నడిపిన డెరిక్ టోనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)