Breaking News

Delhi liquor scam: కేజ్రీవాల్‌ పిటిషన్‌పై ఈడీకి సుప్రీం నోటీస్‌

Published on Tue, 04/16/2024 - 05:18

న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్‌ ఆరోపణలపై తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ సీఎం కేజ్రీవాల్‌ వేసిన పిటిషన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)కి సుప్రీంకోర్టు నోటీసు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ లోగా సమాధానమివ్వాలని ఈడీని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణ ఈ నెల 29వ తేదీన చేపడతామని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం సోమవారం పేర్కొంది. సాధ్యమైనంత త్వరగా విచారణ చేపట్టాలన్న అభిషేక్‌ సింఘ్వి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.

కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్‌ చేయడం చట్ట విరుద్ధం కాదంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 9వ తేదీన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఇలా ఉండగా, ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఢిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇచ్చిన 15 రోజుల కస్టడీ గడువు ముగియడంతో సోమవారం సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక జడ్జి కావేరీ బవేజా వర్చువల్‌గా విచారణ చేపట్టారు. ఏప్రిల్‌ 23వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలిచ్చారు. ఇదే కేసులో బీఆర్‌ఎస్‌ నేత కె.కవిత తదితర నిందితుల కస్టడీ గడువు కూడా అదే రోజుతో ముగుస్తోందని ఆమె తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)