పోరులో పాక్‌ గెల్చిందట! 

Published on Fri, 11/21/2025 - 05:19

న్యూఢిల్లీ: పహల్గామ్‌లో ఉగ్రవాదుల పాశవిక దాడి తర్వాత ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట భారత్‌ జరిపిన దాడులకు పాకిస్తాన్‌ దీటుగా బదులిచ్చిందని, ఆ నాలుగు రోజుల పోరులో పాక్‌ పైచేయి సాధించిందని అమెరికా సెనేట్‌లో సమర్పించిన ఓ నివేదికపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇది మోదీ సర్కార్‌ దౌత్యవైఫల్యానికి ప్రబల నిదర్శనమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి(కమ్యూనికేషన్స్‌) జైరాం రమేశ్‌ గురువారం ‘ఎక్స్‌’లో వ్యాఖ్యానించారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ వేళ కొనసాగిన పరస్పర సైనిక చర్యల్లో భారత్‌పై పాక్‌ విజయం సాధించిందని అమెరికా–చైనా ఆర్థిక, భద్రత సమీక్ష కమిషన్‌ మంగళవారం అమెరికా ఎగువసభ అయిన సెనేట్‌లో 800 పేజీల నివేదికను సమర్పించింది. ‘‘108, 109 పేజీల్లో ఏప్రిల్‌లో పహల్గాం దాడి వెనుక పాక్‌ హస్తముంది. ఆపరేషన్‌ సిందూర్‌ వేళ చైనా అందించిన అత్యాధునిక ఆయుధాలతో భారత్‌ను పాక్‌ ఓడించింది. చైనా అత్యాధునిక ఆయుధాలు, నిఘా సాయంతో పాక్‌ పైచేయి సాధించింది. 

పాక్‌ సైన్యం మాటున చైనా తన అధునాతన ఆయుధ సంపత్తిని నేరుగా భారత్‌ పరీక్షించుకునే సువర్ణావకాశాన్ని సద్వినియోగంచేసుకుంది. తద్వారా తమ ఆయుధాల పనితీరును ప్రపంచానికి చాటిచెప్పి అంతర్జాతీయ ఆయుధ, రక్షణ రంగ మార్కెట్‌లో తన వాటాను పెంచుకోవాలని చూసింది’’ అని నివేదిక పేర్కొంది. ‘‘ అమెరికా సెనేట్‌లో సమర్పించిన నివేదికను చూశాకైనా ప్రధాని మోదీ మౌనం వీడతారా? భారత విదేశాంగ శాఖ తన అభ్యంతరాలను వ్యక్తంచేస్తుందా?’’ అని జైరాం రమేశ్‌ సూటి ప్రశ్న వేశారు. 

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)