Breaking News

లైకులు, వ్యూస్‌ కోసం ఇంత దిగజారాలా?

Published on Mon, 06/16/2025 - 13:47

ఒకవైపు.. ఘోర ప్రమాదంలో అయినవాళ్లను కోల్పోయి పుట్టెడు దుఖంలో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. డీఎన్‌ఏ పరీక్షలు పూర్తి కాకపోవడంతో మృతదేహాల కోసం బీజే మెడికల్‌ కాలేజీ ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఈలోపు.. సోషల్‌ మీడియాలో లైక్స్‌, వ్యూస్‌ కోసం కొందరు దిగజారి ప్రవర్తిస్తున్నారు. మృతుల గురించి తప్పుడు సమాచారాన్ని పోస్ట్‌ చేస్తున్నారు. ఈ పరిణామాలపై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

కొమ్మి వ్యాస్‌.. తన భార్య, ముగ్గురు పిల్లలతో లండన్‌లో స్థిరపడేందుకు ఎయిరిండియా విమానం ఎక్కడిన డాక్టర్‌. అయితే అహ్మదాబాద్‌ ఎయిరిండియా ప్రమాదంలో ఆ కుటుంబం మొత్తం దుర్మరణం పాలైంది. ఇప్పుడు.. ఆ ఫ్యామిలీని బద్నాం చేస్తూ కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. విమానం ఎక్కిన తర్వాత ఫ్యామిలీ ఫొటోను వ్యాస్‌ తన కుటుంబానికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్ట్‌ చేశారు. అయితే ఆ ఫొటోను ఏఐ వీడియోగా కొందరు వైరల్‌ చేస్తున్నారు. మరికొందరు.. ఒక అడుగు ముందుకు వేసి వ్యాస్‌ కూతురు మిరాయ ఫొటోను, ఓ వీడియోను తెరపైకి తీసుకొచ్చారు. 

‘‘మా కుటుంబాన్ని కోల్పోయామన్న బాధలో మేముంటే.. కొందరు విలువలు మరిచి ప్రవర్తిస్తున్నారు. ఎడిట్‌ చేసిన వీడియోను వైరల్‌ చేస్తున్నారు. మా పాప మిరాయ్‌ ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. డీఎన్‌ఏ టెస్టులో ఏ మృతదేహం అనేది దృవీకరణ కాలేదు. కానీ.. ఈలోపే మిరాయ్‌ అంత్యక్రియలంటూ భావోద్వేగం పేరిట ఓ వీడియోను పోస్ట్‌ చేసి కొందరు వ్యూస్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాగేనా చేసేది?’’ అంటూ వ్యాస్‌ కుల్దీప్‌ భట్‌ ఆవేదన-అసహనం వ్యక్తం చేశారు. 

వ్యాస్‌ కుటుంబం మాత్రమే కాదు.. బాధిత కుటుంబాలు చాలా వరకు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఇలాంటి కంటెంట్‌ను ఖండిస్తోంది. సంబంధం లేని వీడియోలు, కంటెంట్‌ను తెర మీదకు తీసుకొచ్చి షేర్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

‘‘ప్రమాదం జరిగిన నాటి నుంచే ఇలాంటి కంటెంట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఎక్కడెక్కడివో వీడియోలను తెచ్చి.. ఎయిరిండియా విమానంలోవి అంటూ పోస్టులు పెడుతున్నారు. మా వాళ్లకు ఏమాత్రం సంబంధం లేని పోస్టులు ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌(ట్విటర్‌)లలో కనిపిస్తున్నాయి. వీటి ఆధారంగా మీడియా సంస్థలు కూడా వార్తలు ప్రచురిస్తున్నాయి. అసలేం చేస్తున్నారు?. ఇలాంటి విషాద సమయంలోనూ కనీస నైతిక విలువలు పాటించరా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు విమాన ప్రమాదంపైనా జోకులు, మీమ్స్‌ వేస్తున్న పరిస్థితి. ఈ తరుణంలో.. ప్రభుత్వాలైన స్పందించి అలాంటి కంటెంట్‌ను కట్టడి చేయాలని కోరుతున్నారు మరికొందరు.

Videos

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

జూడో ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం

Photos

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)