6 నెలల్లో 554 మంది భర్తల మరణాలు : షాకింగ్‌ సర్వే

Published on Sat, 07/18/2026 - 16:09

గురుగ్రామ్‌కు చెందిన 'ఏకం న్యాయ్ ఫౌండేషన్' (Ekam Nyaay Foundation) అనే స్వచ్ఛంద సంస్థ (NGO) సంచలన   నివేదకను వెల్లడించింది. జెండర్ సమానత్వం కోసం, ముఖ్యంగా సమాజంలో పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల నివారణకు పనిచేసే ఈ ఎన్‌జీవో 2026 తొలి ఆరు నెలల్లో (జులై 14 వరకు)  దేశవ్యాప్తంగా 554 మంది భర్తల హత్యలు లేదా ఆత్మహత్యలు చేసుకున్నట్టు తేలిందని ఈ నివేదిక పేర్కొంది. మీడియాలో వచ్చిన వార్తలు, తాము సేకరించిన వివరాల ఆధారంగా ఈ డేటాను సేకరించినట్టు తెలిపింది.

ఇటీవలి కాలంలో ప్రియులతో కలిసి భర్తను దారుణంగా హత్య చేస్తున్న దారుణ ఉదంతాలు ఆందోళన రేపుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటీవల కాబోయే భార్య చేతిలో పుణే రియల్టర్‌ హత్య సంచలనంగా మారింది. అయితే ఇలాంటి ఘటనలు ప్రతిరోజూ జరుగుతున్నాయని  ఏకం న్యాయ్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఫిలిం మేకర్‌,  దీపికా నారాయణ్ భరద్వాజ్‌ వెల్లడించారు. అధికారిక నేరాల డేటాలో పురుషులపై జరిగే గృహహింసకు లేదా భర్తల హత్యలకు ప్రత్యేక వర్గీకరణ (classification) లేకపోవడం వల్ల ఈ సమస్య  తీవ్రతను అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ గణాంకాల ప్రకారం భారతదేశంలో 2026 మొదటి ఆరు నెలల్లో ప్రతిరోజూ సగటున ఇద్దరు భర్తలు హత్యకు గురవుతుండగా, ఒకరి కంటే ఎక్కువ మంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అయితే ఇవి కేవలం మీడియా నివేదికల ఆధారంగా సేకరించినవేనని, ప్రభుత్వ అధికారిక గణాంకాలు కావని స్పష్టం చేసింది. పురుషులపై జరిగే గృహహింసను ట్రాక్ చేయడానికి ప్రత్యేక జాతీయ డేటాబేస్ లేనందున, వాస్తవ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చన్నారు. ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్‌ సక్సెస్‌ స్టోరీ

  • భార్యలు లేదా వారి ప్రియుల చేతిలో హత్యకు గురైన భర్తల కేసులు: 322

  • వైవాహిక వివాదాలు, గృహహింస, వేధింపులు, తప్పుడు కేసుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న భర్తల కేసులు: 232

హత్యలకు ప్రధాన కారణాలు
322 హత్య కేసుల్లో 194 కేసులు (60.2%) వివాహేతర సంబంధాల వల్లే జరిగాయి. వివాహేతర సంబంధాన్ని భర్త వ్యతిరేకించడంతో, భార్యలు తమ ప్రియుళ్లతో కలిసి భర్తలను చంపడానికి కుట్ర పన్నినట్లు నివేదిక పేర్కొంది. 88 కేసులు పాత గృహ వివాదాల కారణంగా జరిగాయి.  మిగిలిన హత్యలు డబ్బు గొడవలు, కుటుంబ కుట్రలు మొదలైన కారణాలతో సంభవించాయి.

ఇదీ చదవండి: తల్లి పనిమనిషి, తండ్రి అకాలమరణం : నీలూ నీట్‌ సక్సెస్‌ స్టోరీ

వణికిస్తున్న హత్యా పద్దతులు
విషం పెట్టడం, సజీవ దహనం, కరెంట్ షాక్ ఇవ్వడం, గొంతు నులమడం, మృతదేహాలను ముక్కలుగా నరకడం, పూడ్చిపెట్టడం, హత్యలను ప్రమాదాలు లేదా ఆత్మహత్యలుగా చిత్రీకరించడం వంటివి ఉన్నాయని ఫౌండేషన్ తెలిపింది. ఈ కాలంలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 93 భర్తల హత్యలు, 103 ఆత్మహత్యలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, హర్యానా, బీహార్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి.

ఇదీ చదవండి: రూ. 1.4 కోట్ల జాక్‌పాట్‌ : నిద్రలేమే వరంలా మారింది

ఫౌండేషన్ ఈ ఏడాది జరిగిన 25 అత్యంత ఘోరమైన కేసులను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందులో భర్తల తలలు నరకడం, ముక్కలుగా కోయడం, ఇళ్లల్లోనే పూడ్చిపెట్టడం వంటి ఘటనలు ఉన్నాయి. మరికొన్ని ఆత్మహత్య కేసుల్లో బాధితులు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లు లేదా రికార్డ్ చేసిన వీడియోలలో... తాము ఎదుర్కొన్న మానసిక క్షోభ, పిల్లలను చూడనివ్వకపోవడం, తప్పుడు కేసుల వేధింపులు ఉన్నాయని దీపికా నారాయణ్ భరద్వాజ్‌ వివరించారు.

ఇదీ చదవండి: రెచ్చిపోయిన పోకిరీకి, యువతి గుణపాఠం : వీడియో వైరల్‌

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)