'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?

Published on Wed, 03/25/2026 - 16:11

'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.

(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్‌ సింగ్‌ ఆరు వారాల్లోనే)

ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్‌లో కావొచ్చు బాలీవుడ్‌లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్.  లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.

టాలీవుడ్‌లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.

ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్‌ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

టాలీవుడ్‌లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్‌కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్‌ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.

'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్‌కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.

(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా)

Videos

ఐదేళ్లలో లక్షను కోటి చేసిన ఐటీ స్టాక్.. ఏకంగా 10 వేల శాతం జంప్ ...

KCR మంచి దోస్త్ నాకు..

తొందర పడకు.. ప్రతి రోజు సినిమా చూపిస్తా..

BJP MLA రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలి..

పూరీలా ఒక్క రోజు బతికితే చాలు..

పరిస్థితుల్ని అదుపుచేయ్యాలి అంటే లాక్ డౌన్ తప్పదా..?

ఆ బిల్లుకు పూర్తి మద్దతు మోదీకి జగన్ ట్వీట్

కూటమి వేధింపులు.. IAS, IPSలను కూడా వదలరా!

యుద్ధం పేరుతో గ్యాస్ మాటలు... కిరోసిన్ ఇస్తావు సరే... స్టవ్ లు సంగతేంటి

ఇబ్బందులు ఉంటాయి తెలిసినా అశోక్ బాబు మాత్రం...

Photos

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

యువ నటుడు కెన్ కరుణాస్ 'యూత్' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్రోల్‌ బంక్‌ల వద్ద భారీ క్యూ.. వదంతులతో జనం పరుగులు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)