Breaking News

'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!

Published on Sat, 03/07/2026 - 18:26

'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?

(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)

గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్‌పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్‌పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.

టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.

(ఇదీ చదవండి: ‘ధురంధర్‌2’కి పెయిడ్‌ ప్రీమియర్స్‌.. రన్‌టైమ్‌ ఎంతంటే?)

తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్‌డేట్ అంటారు. తర్వాత సాంగ్‌కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్‌ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.

తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్‌కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్‌పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్‌లో చాలామంది పాటించరు.

తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్‪‌కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్‌లు తప్పట్లేదు.

(ఇదీ చదవండి: మరింత వైలెంట్‌గా ధురంధర్ 2 ట్రైలర్)

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)